పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల "అజ్ఞాతవాసి" ఫస్ట్ లుక్ విడుదల

Published : Nov 27, 2017, 01:33 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల "అజ్ఞాతవాసి" ఫస్ట్ లుక్ విడుదల

సారాంశం

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి అజ్ఞాత వాసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ వారణాసిలోని పవిత్ర గంగా నది నుంచి అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్ విడుదల

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల  ‘అజ్ఞాతవాసి’  ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి.  అంతే కాదు ఇప్పటి వరకు ‘అజ్ఞాతవాసి’ టైటిల్ పరిశీలనలో ఉందని చెబుతూ వచ్చిన చిత్ర యూనిట్.. అదే టైటిల్ ఖరారు చేశారు.   

 

‘అజ్ఞాతవాసి’ పేరు ఓకే చేస్తూ యూనిట్ ట్వీట్ చేసింది. ఇదే పేరు మీద కొన్నాళ్లుగా ప్రచారం సాగిన విషయం తెలిసిందే.   అంతే కాదు ఈ సినిమాలకు సంబంధించిన ఏ ఒక్క విషయాన్ని కూడా లీక్ చేయకుండా చాలా జాగ్రత్తలు పడుతూ వస్తున్నారు చిత్ర యూనిట్.   ఇక ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో పవన్ లుక్ డిఫరెంట్‌గా వుంది.

 

చేతిలో ఐడీ కార్డు తిప్పుతూ కనిపించడంతో కచ్చితంగా టెక్కీ రోల్ చేస్తున్నాడని అభిమానులు అప్పుడే ఓ అంచనాకి వచ్చేశారు. ఇందులో పవన్‌కి జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు.  2018 జనవరిలో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today 13 డిసెంబర్ ఎపిసోడ్ : రామరాజు ముందు నోరు విప్పిన చందు, అమూల్య బలి, భర్తను బకరా చేసిన వల్లి
Karthika Deepam 2 Latest Episode: జ్యో అరెస్ట్- ఉలుకుపలుకు లేకుండా పడిపోయిన సుమిత్ర-నోరు జారిన పారు