తెలుగింటి కోడలునవుతా అంటున్న రకుల్

Published : Nov 27, 2017, 12:26 PM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
తెలుగింటి  కోడలునవుతా అంటున్న రకుల్

సారాంశం

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హిరోయిన్ గా రకుల్ లక్కీ హీరోయిన్ గానూ పేరుతెచ్చుకుని తెలుగు లోకల్ గా మారిన రకుల్ అబ్బాయి నచ్చితే తెలుగింటి కోడలును కావాలని కలలు కంటున్నట్లు తెలిపిన రకుల్

టాలీవుడ్  క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ అబ్బాయి నచ్చితే తనకు తెలుగు ఇంటి కోడలుగా అవ్వాలని కోరిక ఉంది అంటూ తన మనసులోని మాటను బయట పెట్టింది. అయితే తనకు కాబోయే భర్తకు మూడు లక్షణాలు ఉండాలి అంటూ కండిషన్స్ పెడుతోంది రకుల్. తనకు భర్తగా రావాలి అని కోరుకునే అబ్బాయికి ఫిట్ నెస్ అంటే బాగా ఇష్టం ఉండాలి అదేవిధంగా వ్యాపారం అంటే అభిరుచి ఉండాలి దీనికితోడు డల్ గా ఉండకుండా ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి అంటూ తన కండిషన్స్ ను బయటపెట్టింది రకుల్. అంతేకాదు ఎట్టి పరిస్తుతులలోను తనకు కాబోయే భర్త సిక్స్ ఫీట్ హిట్ ఉండితీరాలనే మరో నిబంధన కూడ పెట్టింది. 

 

ఎప్పుడూ సినిమా ఫెయిల్ అయినందుకు బాధపదననీ, సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన బ్యాడ్ మూడ్ లోకి ఎందుకు వెళ్లిపోవాలి అని ఎదురు ప్రశ్నలు వేస్తోంది రకుల్. జీవితంలో ఎన్నో తప్పులు చేసే ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ గుడి చుట్టూ తిరిగితే దేవుడు పలకడు అని... అంటూ మన పని సక్రమంగా చేసినప్పుడు మాత్రమే దేవుడు సహకరిస్తాడు అని అంటోంది రకుల్.

 

గత 6 సంవత్సరాలుగా తాను ఎన్నో సినిమాలలో అనేకమంది హీరోలతో కలిసి నటించినా తనకు ఏహీరో కూడ లవ్ ప్రపోజ్ చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అని అంటోంది. షూటింగ్ స్పాట్ లో అందరితో జోక్ చేస్తూ తెగ నవ్వుతూ ఉంటాను కాబట్టి ఇలాంటి టామ్ బాయ్ మనకెందుకు అని అనుకుని చాలామంది హీరోలు ప్రేమ విషయంలో తనను పక్కకు పెట్టేస్తున్నారు అని బాధపడుతోంది రకుల్.

PREV
click me!

Recommended Stories

Dhurandhar Day 50 Collection: `బోర్డర్ 2` దెబ్బకు ధురంధర్ ఆట క్లోజ్, 50 రోజుల కలెక్షన్లు
Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే