Bramhastra: ఆసక్తి రేపుతున్న రన్బీర్-అలియా బ్రహ్మాస్త్ర పోస్టర్!

Published : Apr 10, 2022, 02:55 PM IST
Bramhastra: ఆసక్తి రేపుతున్న రన్బీర్-అలియా బ్రహ్మాస్త్ర పోస్టర్!

సారాంశం

నేడు శ్రీరామనవమి పురస్కరించుకొని బాలీవుడ్ భారీ చిత్రం బ్రహ్మాస్త్ర నుండి స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. అలియా-రన్బీర్ కపూర్ లతో కూడిన ఈ పోస్టర్ ఆసక్తిరేపుతోంది.   


బాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం బ్రహాస్త్ర(Bramhastra). రన్బీర్ కపూర్ హీరోగా సూపర్ హీరో ఫిల్మ్ గా తెరకెక్కుతుంది. స్టార్ హీరోయిన్ అలియా భట్ రన్బీర్ కి జంటగా నటిస్తున్నారు. నేడు శ్రీరామ నవమి పురస్కరించుకొని బ్రహ్మాస్త్ర మూవీ నుండి స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.రన్బీర్-అలియాలతో కూడిన బ్రహ్మాస్త్ర లేటెస్ట్ అబ్బురపరుస్తుంది. సోషియో ఫాంటసీ అంశాలు జోడించి దర్శకుడు అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర తెరకెక్కిస్తున్నారు. రన్బీర్ శివ అనే రోల్ చేస్తుండగా, అలియా.. ఈశా మిశ్రా రోల్ చేస్తున్నారు. 

ప్రకటన నాటి నుండే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై హైప్ నెలకొంది. టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఆయన పురాతత్వ శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. అలాగే బిగ్ బి అమితాబ్ కూడా నటిస్తున్నారు. బ్రహ్మాస్త్ర రెండు భాగాలుగా విడుదల కానుంది. బ్రహ్మాస్త్ర మొదటి పార్ట్ శివ... ట్యాగ్ లైన్ తో విడుదల కానుంది. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మాతగా ఉన్నారు. సెప్టెంబర్ 9న వరల్డ్ వైడ్ గా బ్రహ్మాస్త్ర విడుదల కానుంది. 

చాలా కాలం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ పలు కారణాలతో లేటైంది. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ(RRR Movie)లో హీరోయిన్ గా నటించిన అలియా భట్ హీరోయిన్ గా నటించడం కూడా ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం. అలాగే నాగార్జున నటించడం వలన సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ లో ప్రచారం దక్కే అవకాశం కలదు. 

మరోవైపు రన్బీర్(Ranbir kapoor)-అలియా పెళ్లి వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన రానున్నప్పటికీ త్వరలోనే వీరు వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బ్రహ్మాస్త్ర మూవీ సెట్స్ లోనే అలియా(Alia Bhatt), రన్బీర్ మధ్య ప్రేమ చిగురించిందనేది టాక్. 2018 నుండి ఈ జంట డేటింగ్ చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Divvala Madhuri అసలు రూపం బయటపెట్టిన రీతూ చౌదరీ తల్లి.. అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌
Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?