ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తే.. క్లాస్ పీకింది: పవన్ కళ్యాణ్!

By Udayavani DhuliFirst Published 2, Sep 2018, 10:53 AM IST
Highlights

ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనే కాన్సెప్ట్ చాలా కామన్. అందులోనూ.. తొలిప్రేమ ఎప్పటికి గుర్తుండిపోతుంది. అప్పటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకొని తరువాతి కాలంలో నవ్వుకుంటుంటారు.

ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనే కాన్సెప్ట్ చాలా కామన్. అందులోనూ.. తొలిప్రేమ ఎప్పటికి గుర్తుండిపోతుంది. అప్పటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకొని తరువాతి కాలంలో నవ్వుకుంటుంటారు. పవన్ కళ్యాణ్ జీవితంలో కూడా అలాంటి సంఘటన జరిగింది. ఆ విషయాన్ని గతంలో ఓ సందర్భంలో వెల్లడించారు పవన్. ఆయన హీరో కాకముందు మద్రాసులో కంప్యూటర్ క్లాస్ లకు వెళ్లేవారు.

అక్కడ ఓ అమ్మాయితో అతడికి స్నేహం ఏర్పడింది. ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉండేవారట. కోర్స్ ముగిసిపోతుందన్న సమయంలో ఇద్దరి మధ్య చనువు పెరిగింది. పవన్ స్నేహితులు కొందరు ఇది కేవలం స్నేహం మాత్రమే కాదు.. ప్రేమ కూడా.. నీ మనసులో మాట ఆమెకు చెప్పు అంటూ అతడిని ప్రోత్సహించారట. నిజానికి పవన్ మనసులో అలాంటి ఆలోచనలు లేకపోయినా.. స్నేహితులు అంతగా చెబుతుండడంతో ఇది ప్రేమే అనుకొని ఆమెకు ప్రపోజ్ చేయడానికి బయలుదేరాడు.

ఇంట్లో ఎవరూ వాడకుండా పక్కన పడేసిన ఓ డొక్కుకారుని బయటకి తీసి, దాన్ని శుభ్రం చేసి కారులో అమ్మాయిని ఎక్కించుకొని కొంత దూరం తీసుకెళ్లి తన మనసులో మాట చెప్పాడట. పవన్ ఇబ్బంది పడుతూ చెప్పిన మాటలను ఓపికగా విన్న ఆమె అతడికి క్లాస్ తీసుకోవడం మొదలుపెట్టిందట. అసలు ఈ వయసులో ప్రేమేంటి..? అంటూ ఆమె క్లాస్ పీకుతుంటే మా క్లాస్ టీచర్ లా కనిపించిందంటూ పవన్ ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నాడు!

ఇది కూడా చదవండి.. 

తెలుగు ప్రజలు ఆరాధించే పవర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు!

Last Updated 9, Sep 2018, 12:01 PM IST