
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana) నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’. ప్రేక్షకుల్లో రోజురోజుకు అంతకంతకు హైప్ పెంచుకుంటూ వెళ్తున్న సాలిడ్ మాస్ చిత్రమిది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 25న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టు ఇటీవల మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ కు సిద్ధమైంది. అయితే విడుదలకు ఇంకా వారం రోజుల సమయం మిగిలి ఉంది. ఈ లోపు పవన్ ఫ్యాన్స్ కు మేకర్స్ బిగ్గెస్ట్ ట్రీట్ ఇవ్వనున్నారు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం నుంచి అభిమానులను ఖుషీ చేసేందుకు మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ను మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో నిర్మాణ సంస్థ ‘సితారా ఎంటర్ టైన్స్ మెంట్’ వారు వెల్లడించారు. నిర్మాత నాగవంశీ ఆల్రెడీ ఈ సినిమా నుంచి ఇక టీజర్ ఉండదు డైరెక్ట్ ట్రైలర్ నే ఉంటుంది అని కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. రేపో, ఎల్లుండో రెండురోజుల్లో మూవీ ట్రైలర్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు పలువురు సినీ వర్గాలకు చెందిన వారు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా నిత్య మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటించారు.
మరోవైపు ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రమోషన్స్ సాంగ్ ను కూడా రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీని రిలీజ్ అయిన గ్లిమ్స్, టైటిల్ సాంగ్ ఆడియెన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. తాజాగా ఈ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. మరోవైపు ఈ మూవీ హిందీలోనూ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఫస్ట్ డే షో కోసం థియేట్లర్లలో 70 శాతం బుుక్కింగ్స్ కంప్లీట్ అయ్యింది.