రామ్ చిత్రం, మాధవన్ వివరణ,వెనక జరిగింది ఇది

Surya Prakash   | Asianet News
Published : Jun 14, 2021, 09:07 AM IST
రామ్ చిత్రం, మాధవన్ వివరణ,వెనక జరిగింది ఇది

సారాంశం

మాధవన్ ఈ ప్రాజెక్టుకు లింక్ పెడుతూ వచ్చిన వార్తలు వెనక ఉన్న అసలు కథేంటి అనేది ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశంగా మారింది.  

ఎనర్జిటిక్ హీరో రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ మాస్ మసాలా చిత్రాన్ని చేస్తున్నాడు. కృతిశెట్టి  హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం సాగుతున్నాయి. కొవిడ్ ఉద్ధృతి తగ్గగానే షూటింగ్ మొదలెడతారు. ఇక ఈ సినిమాలో ప్రధాన విలన్ పాత్రకు మాధవన్ ను తీసుకున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న మాధవన్ వెంటనే స్సందించారు.

"వండర్ ఫుల్ దర్శకుడు లింగుస్వామి సినిమాలో నటించాలని నాకూ ఎంతగానో వుంది. అయితే, ఆయన చేస్తున్న తెలుగు సినిమాలో నేను విలన్ గా నటిస్తున్నానంటూ వస్తున్న వార్తలలో మాత్రం వాస్తవం లేదు" అంటూ ట్వీట్ చేస్తూ క్లారిటీ ఇచ్చాడు మాధవన్.  అయితే మాధవన్ ఈ ప్రాజెక్టుకు లింక్ పెడుతూ వచ్చిన వార్తలు వెనక ఉన్న అసలు కథేంటి అనేది ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

తమిళ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న దాన్ని బట్టి లింగుస్వామి నిజంగానే మాధవన్ పేరు ఈ ప్రాజెక్టుకుక సూచించారట. రామ్,నిర్మాతలను ఒప్పించే ప్రయత్నం చేసారు. అయితే మాధవన్ తెలుగులో విలన్ గా చేసిన నాగచైతన్య చిత్రం డిజాస్టర్ అవటం, ఆ తర్వాత అనుష్క నిశబ్దంలో కూడా ఆయన విలన్ గా చేయటం..అదీ డిజాస్టర్ అవటం జరిగింది. ఈ నేపధ్యంలో వద్దనుకున్నారు. అయితే ఈ విషయం మీడియాలో లీకైంది. చివరకు మాధవన్ వివరణ ఇచ్చుకోవాల్సి  వచ్చింది.
 
మరో ప్రక్క ఈ సినిమాలో తమిళ నటుడు అరుణ్‌ విజయ్‌లు నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వారితో చిత్ర టీమ్ సంప్రదించి, స్క్రిప్టుని కూడా వినిపించారట. కానీ వారి నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదని అంటున్నారు. ఈ వార్తపై పూర్తి సమాచారం తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే. 

పవన్‌ కుమార్‌ సమర్పణలో ‘రాపో 19’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ యాక్షన్‌ మూవీలో రామ్‌ పవర్‌పుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనున్నాడట. గత నెలలోనే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్‌ ప్రారంభం కాలేదు. లాక్‌డౌన్‌ అంక్షలు ఎత్తేయగానే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడిగా పనిచేయనున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తెలుగు - తమిళంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కనుంది. హీరో రామ్‌తో పాటు కృతి శెట్టికి తమిళంలో ఇదే మొదటి సినిమా అవుతోంది.  అరుణ్‌ విజయ్‌ తెలుగులో రామ్‌చరణ్‌తో కలిసి ‘బ్రూస్‌ లీ’, ప్రభాస్‌తో కలిసి ‘సాహో’లో నటించారు. 

PREV
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?