జైల్లో బాలయ్య న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్.. 2022 అలా ముగిసింది..

By team teluguFirst Published Dec 31, 2022, 7:00 PM IST
Highlights

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ జోరు మామూలుగా లేదు. సంక్రాంతికి విడుదల కాబోతున్న వీరసింహారెడ్డి చిత్ర ప్రచార కార్యక్రమాలు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ జోరు మామూలుగా లేదు. సంక్రాంతికి విడుదల కాబోతున్న వీరసింహారెడ్డి చిత్ర ప్రచార కార్యక్రమాలు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. మరోవైపు బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో క్రేజ్ రోజు రోజుకి రెట్టింపు అవుతోంది. ఇటీవల బాలయ్య మరో కొత్త చిత్రాన్ని కూడా ప్రారంభించారు. 

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఎన్బీకే 108 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర యూనిట్ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. అనిల్ రావిపూడి, బాలయ్య చిత్ర ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది. తొలి షెడ్యూల్ లో భారీ జైలు సెట్ లో యాక్షన్ సన్నివేశాన్ని బాలయ్యపై చిత్రీకరించారు. మొత్తంగా బాలయ్య 2022ని యాక్షన్ ఎపిసోడ్ తో ముగించారు. 

కాగా నేడు చిత్ర యూనిట్ ఎన్బీకే 108 సెట్స్ లో న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేశారు. బాలకృష్ణ, అనిల్ రావిపూడి, నిర్మాతలు, ఇతర టీం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ బాలకృష్ణ కేక్ కట్ చేసి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆ విధంగా బాలకృష్ణ తన జైలు సెట్ లో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ జరుపుకున్నారు. 

షైన్ స్క్రీన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కూడా సంగీత దర్శకత్వం తమన్ అందిస్తున్నారు. అనిల్ రావిపూడి తనదైన శైలిలో కామెడీ యాక్షన్ మిక్స్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. 2023 సెకండ్ హాఫ్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

New year celebrations from the sets of 🔥

First schedule has been wrapped with a Huge Action Sequence at a Massive Jail Set❤️‍🔥💫
Natasimham pic.twitter.com/RdpdOkV4yY

— Shine Screens (@Shine_Screens)
click me!