రష్మికని పాటలకే వాడుకున్నారు.. నేషనల్‌ క్రష్‌పై పరుచూరి గోపాలకృష్ణ షాకింగ్‌ కామెంట్స్

Published : Mar 11, 2023, 04:27 PM ISTUpdated : Mar 11, 2023, 04:29 PM IST
రష్మికని పాటలకే వాడుకున్నారు.. నేషనల్‌ క్రష్‌పై పరుచూరి గోపాలకృష్ణ షాకింగ్‌ కామెంట్స్

సారాంశం

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నాపై పరుచూరి బ్రదర్‌ షాకింగ్‌ కామెంట్‌ చేశారు. ఆమె పాటలకే పరిమితమయ్యిందని వెల్లడించారు. ఆయన కామెంట్లు రచ్చ చేస్తున్నాయి.   

ఒకప్పుడు రైటర్స్ గా టాలీవుడ్‌ని శాషించారు పరుచూరి బ్రదర్స్. ఫ్యామిలీ, యాక్షన్‌, కమర్షియల్‌ చిత్రాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా తిరుగుబాటు కథలతో మెప్పించారు. ఇప్పుడు కొత్త రైటర్స్ వచ్చిన నేపథ్యంలో వీరి జోరు తగ్గింది. అడపాదడపా రచయితలుగా సినిమాలకు పనిచేస్తున్నారు. అయితే చాలా కాలంగా పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ పెద్ద సినిమాలపై రివ్యూలు చెబుతున్నారు. విడుదలైన దాదాపు నెల రోజులకు ఆయన రివ్యూ ఇస్తున్నారు. తాజాగా ఆయన `వారసుడు` సినిమా రివ్యూ చెప్పారు. ఈ సందర్భంగా రష్మిక మందన్నా పాత్రపై ఆయన షాకింగ్‌ కామెంట్స్ చేశారు. ఆమెని పాటలకే పరిమితం చేశారని చెప్పారు. 

హీరో విజయ్‌, హీరోయిన్‌ రష్మిక మందన్న లవ్‌ ట్రాక్‌ ఇంకా పెట్టాల్సిందని, కానీ చాలా తక్కువ సీన్లకే పరిమితం చేశారని, సినిమా మైనస్‌లో ఇది ముఖ్యమైనదని ఆయన వెల్లడిచారు. రష్మికని పాటల కోసమే వాడుకున్నారు. నటనకు ప్రయారిటీ ఇవ్వలేదని, నిడివి కూడా చాలా తక్కువే అన్నారు. `వారసుడు` సినిమాలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, కుట్రలు కుతంత్రాలు, విడిపోవడాలకే ప్రయారిటీ ఇచ్చారని, దాన్ని కొంత కట్‌ చేసి, హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ కథకి ప్రయారిటీ ఇవ్వాల్సింది అన్నారు. 

సినిమాలో తండ్రి పాత్ర చనిపోవడాన్ని చూపించారు. తండ్రి అస్థికలు నదిలో కలిపినట్టు చూపించారు, కానీ ఆ షాట్‌ చూపించకుండా, హీరోహీరోయిన్లకి పెళ్లి చేసి, తండ్రి అక్షింతలు వేసినట్టు చూపించాల్సింది అన్నారు. సినిమాలో హీరోయిన్‌ పాత్ర పావుగంటయినా పెంచాల్సిందని, ఆమె పాత్రకి అన్యాయం జరిగినట్టే అని వెల్లడించారు పరచూరి గోపాలకృష్ణ. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రష్మిక ని పాటలకే వాడుకోవడమనేది హాట్‌ టాపిక్‌ అవుతుంది. అయితే నిజంగానే సినిమాలో రష్మిక మందన్నా పాత్రకి ఏమాత్రం ప్రయారిటీ ఉండదు, ఒకటి రెండు సీన్లలు మెరుస్తుంది, పాటల్లో తప్ప ఆమె మరే చోట కనిపించదు. 

ఇక `వారసుడు` సినిమా గురించి చెబుతూ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బాగుంటుందని చెప్పిన ప్రయత్నం బాగుందని, ఈ విషయంలో సినిమా చేసిన హీరో విజయ్‌ని, దర్శకుడు వంశీ పైడిపల్లిని అభినందించారు పరుచూరి. ఓ సీన్‌లో విజయ్‌ని చైర్మెన్‌గా ఎన్నుకోవడానికి తక్కువ ఓట్లు పడతాయి, అప్పుడు విజయ్‌ ఓటేనే వాళ్ల తప్పులను ఎత్తిచూపించడంతో వెంటనే వారు మనసు మార్చుకుని హీరోకి ఓటేసే సీన్‌ బాగుందన్నారు. వందలమందినైనా కొట్టే హీరో తన అన్నయ్య మీద ఒక్క దెబ్బ కూడా చేయడు, తండ్రి అనారోగ్యాన్ని తల్లికి, అన్నలకు తెలియనివ్వకుండా జాగ్రతపడే సీన్‌, ఒకానకొ దశలో తండ్రి సామ్రాజ్యం కుప్పకూలేట్టుగా ఉంటే, హీరో దాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. 

ఆ తర్వాత ఇద్దరు అన్నయ్యలను హీరో ఇంటికి తీసుకు రావడం బాగున్నాయన్నారు. చివరల్లో తండ్రిని కాపాడుకోలేనట్టుగా చూపించకుండా, `నాన్న అంతా సెట్‌ చేశాను, నేను తిరిగి అమెరికా వెళ్తున్నా` అని చెబితే బాగుండేదన్నారు. అలాగే శ్రీకాంత్‌తో ఎఫైర్‌ పెట్టుకున్న అమ్మాయి ఏమైందో చూపించలేదని, చిన్న చిన్న పొరపాట్లు మినహా సినిమా బాగుందన్నారు పరుచూరి గోపాలకృష్ణ. ఇక విజయ్‌, రష్మిక జంటగా నటించిన `వారసుడు` చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. శ్రీకాంత్‌, శ్యామ్‌, ప్రకాష్‌ రాజ్‌, సంగీత, శరత్‌ కుమార్‌, జయసుధ కీలక పాత్రలు పోషించారు. దిల్‌రాజు నిర్మించిన తమిళ చిత్రమిది. సంక్రాంతి విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కానీ రెండు వందల కోట్లుపైగా కలెక్షన్లు సాధించింది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

సంజూ శాంసన్ vs కీర్తి సురేష్ .. వీరిలో నెంబర్ 1 ఎవరో తెలుసా..?
Maheshbabu కోసం కదిలి వచ్చిన పవన్ కళ్యాణ్‌, వెంకటేష్‌, నాగార్జున.. కట్‌ చేస్తే సినిమా ఫ్లాప్‌