Prema Entha Madhuram: తల్లి, కొడుకుల ప్రవర్తనకి ఆశ్చర్యపోతున్న అంజలి.. భార్యని నిలదీస్తున్న ఆర్య!

Published : Mar 11, 2023, 03:41 PM IST
Prema Entha Madhuram: తల్లి, కొడుకుల ప్రవర్తనకి ఆశ్చర్యపోతున్న అంజలి.. భార్యని నిలదీస్తున్న ఆర్య!

సారాంశం

Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ చక్కని కథతో మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. చక్కని కధాంశంతో ప్రేక్షకుల హృదయాన్ని దోచుకుంటుంది ఈ సీరియల్. ఇక ఈరోజు  మార్చి 11 ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం.  

 ఎపిసోడ్ ప్రారంభంలో తనకి ఇష్టం లేకపోయినా అత్తగారి బలవంతం మీద హారతి ఇచ్చి బొట్టు పెడుతుంది మాన్సీ. లోపలికి రావడానికి సంకోచిస్తున్న ఆర్య వర్ధన్ దంపతులను అక్కడే ఆగిపోయారేమి లోపలికి రండి అంటుంది మాన్సీ. రిక్వెస్ట్ చేసి డైనింగ్ టేబుల్ ముందు కూర్చో పెడతాడు నీరజ్. అను టేబుల్ మీద కూర్చోవడానికి మొహమాటపడుతుంది.

నీకు మొహమాటం ఎక్కువ వచ్చి నువ్వు కూడా కూర్చో అంటుంది అంజలి. ఇది మీ ఇల్లు లాంటిది మొహమాట పడకుండా అందరూ  కూర్చుని భోజనం చేయండి అంటుంది శారదమ్మ. నాకు అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ లేవు,పెద్దవాళ్లు తిండికి ముందు ఉండాలి యుద్ధానికి  వెనకాతల ఉండాలి అన్నారు.నేను దాన్నే ఫాలో అవుతాను అంటాడు యాదగిరి.

ఆ మాటలకి అందరూ నవ్వుకుంటారు. శారదమ్మ భోజనం వడ్డిస్తుంటే చాలు అత్తమ్మ అని నోరు జారుతుంది అను. అందరూ ఒక్కసారిగా షాక్ అవ్వటంతో మళ్లీ చాలండి అంటుంది. ఏంటి మీ అత్తగారి గుర్తొచ్చారా అంటుంది అంజలి. కడుపుతో ఉన్నప్పుడు మంచి ఆహారం తినాలి వద్దనకూడదు తిను అంటూ కొసరి కోసరి వడ్డిస్తుంది శారదమ్మ.

నువ్వు కూడా భోజనం చేయి నీరజ్ అంటుంది అంజలి. నాకు మా దాదాగాని మా అమ్మగాని ముద్దలు కలిపి పెడితేనే  తినేవాడిని అంటాడు నీరజ్. దాదానా అని కన్ఫ్యూజ్డ్ గా చూస్తుంది అంజలి. అంటే మా అన్నయ్య అంటాడు నీరజ్ అవునా నీకు అన్నయ్య ఉన్నాడా మరి ఎప్పుడూ చెప్పలేదు అంటుంది అంజలి. ఉన్నాడమ్మ పేరు  ఆర్య వర్ధన్ ,నా పెద్ద కొడుకు అని చెప్తుంది శారదమ్మ.

నేను ఇంకా మీ ఫాదర్ పేరేమో అనుకున్నాను అంటుంది అంజలి.అన్నయ్య అంటే తండ్రితో సమానమే కదా, నీరజ్ వర్ధన్ అనే గుర్తింపుతో సహా అన్ని మా దాదా ఇచ్చినవే అంటాడు నీరజ్. గ్రేట్ బాండింగ్ అంటుంది అంజలి. ఇ ఫ్యూ డోంట్ మైండ్ నాకు ఒక ముద్ద పెడతారా అని ఆర్యని అడుగుతాడు నీరజ్. అందరూ ఒక్కసారిగా నీరజ్ ని చూస్తారు.

 అంటే మా దాదా దగ్గర అలవాటు కదా, మిమ్మల్ని చూస్తే మా దాదా లాంటి ఫీలింగ్ వచ్చింది అందుకే అడిగాను అంటాడు. ఆర్య ఎంతో ఎమోషనల్ గా తమ్ముడికి ముద్ద పెడతాడు. మీ దాదా ఇక్కడ లేరా అని అంజలి అడుగుతుంది. లేరు దూరంగా ఉన్నారు అంటాడు నీరజ్. తను ఏం చేసినా వర్ధన్ కుటుంబ గౌరవాన్ని కాపాడటం కోసమే చేస్తాడు ఇప్పుడు కూడా వర్ధన్ కుటుంబ గౌరవాన్ని పెంచడానికి వ్యాపారాన్ని విస్తరించే పనిలో ఉన్నాడు అంటుంది శారదమ్మ.

వెరీ డేడికేటెడ్ అనమాట అచ్చు మా ఆనంద్ లాగా అంటుంది అంజలి. అవును అంటుంది శారదమ్మ. అంతలోనే ఆర్య పొలమారటంతో శారదమ్మ, నీరజ్ కంగారుగా అతని దగ్గరికి వెళ్లి తలనిమిరి మంచినీళ్లు అందిస్తారు. ఇప్పుడు ఓకేనా ఆర్య అంటూ నోరు జారుతుంది శారదమ్మ. వాళ్ళ ప్రవర్తనని ఆశ్చర్యంగా చూస్తుంది అంజలి. ఇంతసేపు ఆర్య గురించే మాట్లాడాం కదా అందుకే ఫ్లో లో అలా అనేసింది అని కవర్ చేస్తాడు నీరజ్.

 భోజనం చేసి వెళ్ళిపోతున్న ఆర్య కి పాయసం తినకుండా వెళ్ళిపోతున్నావేం బాబు నేను కూడా మీ అమ్మ లాంటి దాన్నే కదా తిను అని ఇస్తుంది శారదమ్మ. పాయసం తీసుకుని థాంక్స్ చెప్పి బయటికి వెళ్లిపోతాడు ఆర్య. చూడబోతే ఆనంద్ కి తన ఫ్యామిలీ గుర్తొచ్చినట్లుంది అందుకే సైలెంట్ గా బయటికి వెళ్లిపోయాడు అంటుంది అంజలి.

 అంజలితో పాటు అనుకి కూడా పాయసం ఇస్తుంది శారదమ్మ. పాయసం చాలా బాగుంది మా అప్పు చేసినట్లే ఉంది అంటుంది అంజలి. మీ అప్పుకి పాయసం చేయడం కూడా వచ్చా అంటుంది మాన్సీ. వంట మనిషికి అన్ని వంటలు రాకుండా ఉంటాయా ఏంటి అంటుంది అంజలి. వంట మనిషి అంటూ ఎమోషనల్ అవుతుంది శారదమ్మ.

 మీకు చెప్పలేదు కదా తను మా ఇంట్లో వంట మనిషి. అవటానికి వంట మనిషి అయినా  తను నాకు సిస్టర్ లాంటిది అంటుంది అంజలి. రిలేషన్ ఎలాంటిదైనా పొజిషన్ ఇంపార్టెంట్ కదా, ఒక వంట మనిషిని నీతో సమానంగా కూర్చోబెట్టుకోవడమే నీ గొప్పతనం అంటుంది  మాన్సీ. మన అర్హతని బట్టి విలువ ఉంటుంది అంటుంది అంజలి.

నావల్లే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటూ గిల్టీగా ఫీల్ అవుతాడు నీరజ్. కడుపు మొత్తం ఫుల్ అయిపోయింది ఆ పాయసం కూడా తింటే బరాబర్ పూర్తవుతది అంటాడు యాదగిరి. మీరు గార్డెన్ లో కూర్చుండి నేను తెస్తాను అంటాడు సర్వర్. సరే అయితే వచ్చేటప్పుడు పిల్లి కూడా తీసుకొని రా అంటూ తనతో పాటు స్టాక్ అందర్నీ తీసుకొని వెళ్ళిపోతాడు యాదగిరి.

మా యాదగిరి కి తిండి ధ్యాస తప్పితే వేరే ధ్యాస ఉండదు అంటుంది అంజలి. వాష్ రూమ్ ఎక్కడ అని మాన్సీని అడుగుతుంది అంజలి. రండి చూపిస్తాను అంటూ ఆమెని తీసుకువెళ్తుంది మాన్సీ. అప్పుడు శారదమ్మ అనుని నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో వంట మనిషిగా పనిచేయడం ఏంటి అంటుంది. అవును వదినమ్మ మీరు ఈ ఇంటి మహారాణి.

మీరు ఇల్లు గడవడం కోసం పనిచేయటం ఏంటి? అయినా దాదా ఎలా ఒప్పుకున్నారు అంటాడు నీరజ్. నేను అక్కడ పని చేస్తున్నట్లు సర్ కి తెలియదు. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు నాకు అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం పగలు రాత్రి కష్టపడుతున్నారు. ఆయన కష్టం చూడలేకే నేను పని చేస్తున్నాను అంటుంది అను. మీరు ఇలా కష్టాలు పడటానికి నేనే కారణం అని కన్నీరు పెట్టుకుంటాడు నీరజ్.

 అలాంటిదేమీ లేదు నిజం చెప్పాలంటే మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాము. మీరు గిల్టీ గా ఫీల్ అవ్వకండి అంటుంది అను. మరోవైపు ఇల్లు చూస్తున్న అంజలి ఇల్లు చాలా బాగుంది అంటుంది అంజలి. ఇంటీరియర్ అంతా నాకు నచ్చినట్లుగా డిజైన్ చేయించుకున్నాను అంటుంది మాన్సీ.అంతలోనే ఫోన్ రావడంతో ఆ మాటల్లో పడిపోతుంది  మాన్సీ.

 అంజలి వెనకాతల ఆర్య ఫోటో ఉండడాన్ని గమనించిన మాన్సీ కంగారుపడుతూ ఆమెని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. మరోవైపు నేను ఆర్యని ఒప్పిస్తాను మీరు ఇంటికి వచ్చేయండి అంటుంది శారదమ్మ. అవును వదినమ్మ మేమందరం ఉండగా మీరు ఎవరు లేనట్లుగా ఉండడం ఏమీ బాగోలేదు అంటాడు నీరజ్.ఆర్య సార్ ఒక మాటకి కట్టు పడితే దానిని మీకు కూడా తెలుసు కదా.

 అయినా ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు పదండి వెళ్దాం అని హాల్లోకి శారదమ్మ వాళ్ళని తీసుకొని వచ్చేస్తుంది. అంతలోనే అక్కడికి వచ్చిన అంజలి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థాంక్స్ ఆంటీ ఇంక మేము బయలుదేరుతాము అంటుంది. ఒక్క నిమిషం అంటూ గోపిని పిలిచి స్టాఫ్ అందరిని లోపలికి పిలుచుకొని రా అని  చెప్తుంది శారదమ్మ. ఆర్య ని తీసుకురమ్మని నీరజ్ కి చెప్తుంది.

 సార్ ని నేను తీసుకు వస్తాను అంటుంది అను. మా అప్పు ఎప్పుడూ ఇంతే అన్ని పనులు తనే చేయాలి అంటుంది,చాలా కలివిడి మనిషి అంటుంది అంజలి. మరోవైపు ఆర్య ని పిలవడానికి వచ్చిన అనుతో నువ్వు అంజలి మేడం తో ఉండడం ఏంటి అంటాడు ఆర్య. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: ఆయన్ని నమ్మి వచ్చిన హీరోయిన్, చిరంజీవి సినిమాతో ఘోర అవమానం..సెట్ లో అందరి ముందు అసభ్యంగా..
సంజూ శాంసన్ vs కీర్తి సురేష్ .. వీరిలో నెంబర్ 1 ఎవరో తెలుసా..?