‘తెలుగు ఇండియన్ ఐడల్ S2’లో అమెరికన్ డాక్టర్.. ఆకట్టుకుంటున్న శృతి నండూరి స్వరం.!

Published : Mar 11, 2023, 03:48 PM ISTUpdated : Mar 11, 2023, 03:59 PM IST
‘తెలుగు ఇండియన్ ఐడల్ S2’లో అమెరికన్ డాక్టర్.. ఆకట్టుకుంటున్న శృతి నండూరి స్వరం.!

సారాంశం

‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్  2’ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. లేటెస్ట్ ఎపిసోడ్ లో అమెరికాకు చెందిన డాక్టర్ తన స్వరంతో ఆకట్టుకుంటోంది. దీంతో షోపై మరింత ఆసక్తి పెరుగుతోంది.  

‘ఆహ’లో ప్రసారం అవుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సీజన్ -2’ (Telugu Indina Idol S2)కు సంబంధించిన అప్డేట్స్  ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి.  మొదటి సీజన్ తో సెన్సేషన్ క్రియేట్ చేయగా.. రెండో సీజన్ కూడా అంతే ఆసక్తికరంగా కొనసాగుతోంది. మార్చి 3 నుంచి  Ahaలో ప్రసారం  అవుతోంది. ప్రతి శుక్ర, శనివారాల్లో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్స్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. దాని ప్రకారం.. ఇవ్వాళ్టి ఎపిసోడ్ లో అమెరికన్ డాక్టర్ పార్టిసీపేట్ చేయడం ఇంట్రెస్ట్ ను  క్రియేట్  చేస్తోంది. 

అమెరికాకు చెందిన డాక్టర్ శృతి నండూరికి సంగీతం అంటే ప్రాణం. 70, 80 లలో తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపిన "ఎంకి" పాటలను అందించిన గొప్ప సంగీత వారసత్వం ఉన్న నండూరి కుటుంబం నుంచి వచ్చింది. అందుకే శృతికి సంగీతం పట్ల ఎప్పటినుండో మక్కువ ఉందని తెలిపింది. దీంతో ఆమె తన వైద్య సాధనలో పాటు సంగీత అభిరుచిని కూడా వదులుకోలేదు. ఈక్రమంలో ‘తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2’లోకి ఎంట్రీ ఇచ్చి తన గాత్రంతో ఆకట్టుకుంటోంది. మరీ శ్రుతికి గోల్డెన్ టికెట్ అందుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.   

వేదికపై శృతి తన అద్భుతమైన ప్రతిభ, అచంచలమైన అంకితభావంతో ఆకట్టుకుంది. "శ్రీరామ రాజ్యం" చిత్రం నుండి "శ్రీరామ లేరా ఓహ్ రామా" వంటి క్లాసిక్ తెలుగు పాటతో మంత్రముగ్ధులను చేసింది. అయినా జడ్జెస్ సంత్రుప్తి చెందినట్టు గా కనిపించలేదు. ముఖ్యంగా సింగర్ కార్తీక్ స్టేజీ పైనుంచి వెళ్లియారు.  ఆమె ప్రదర్శన ముగింపులో జడ్జి S.S థమన్ కూడావేదిక నుండి నిష్క్రమించారు. ఇంతకీ జడ్జీలు ఎందుకు వెళ్లిపోయారు. ఉత్కంఠభరితమైన ప్రదర్శనలో ఆ సస్పెన్స్ ఏమై ఉంటుందనేది.. ఇవాళ రాత్రి 7గంటలకు ప్రసారమయ్యే లేటెస్ట్ ఎపిసోడ్ చూస్తే అర్థం అవుతుంది. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: ఆయన్ని నమ్మి వచ్చిన హీరోయిన్, చిరంజీవి సినిమాతో ఘోర అవమానం..సెట్ లో అందరి ముందు అసభ్యంగా..
సంజూ శాంసన్ vs కీర్తి సురేష్ .. వీరిలో నెంబర్ 1 ఎవరో తెలుసా..?