
బాహుబలి పూర్తి కాగానే ప్రభాస్ యువీ క్రియేషన్స్ బ్యానర్లో సినిమా చేయబోతున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ చివర్లో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరో నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో.. ప్రీ ప్రొడక్షన్ పనులు వేగం పుంజుకున్నాయి. ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ భామ పరిణీతి చోప్రాను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే ఆమెకు ప్రపోజల్ పంపారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాపై పరిణీతి చోప్రా సైతం ఆసక్తిగా ఉందని తెలుస్తోంది.
ప్రభాస్ తదుపరి మూవీపై 150కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారని.. ఈ మొత్తాన్ని రాబట్టుకునేందుకు తెలుగుతోపాటు హిందీ-తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్ కు క్రేజ్ మరింత పెంచాలంటే... బాలీవుడ్ లో మాంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ ను తీసుకోవాలని భావించాడు దర్శకుడు సుజిత్. సో... బాహుబలితో సినీ పరిశ్రమల మధ్య అంతరం మరింత తగ్గిన నేపథ్యంలో... బాలీవుడ్ భామలను తెలుగులోకి డంప్ చేయడం మళ్లీ మొదలవుతోందన్న మాట.