
సాయికుమార్ ఈ సినిమాలో ఫైర్‌మెన్ పాత్రలో నటిస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావటానికి కారణాల్ని చూపే ఈచిత్రం ప్రేక్షకుల మనసును కదిలించేలా ఉంటుందని సాయికుమార్ తెలిపారు. ఇక దర్శకుడు శంకర్ తర్వాత బాడీగిమ్మెల్ అనే కెమెరా టెక్నిక్‌ను ఈ సినిమాలోనే ఉపయోగించామని దర్శకురాలు జయ తెలిపారు. చిన్న సినిమాల్లో ఇది కాస్త పెద్ద బడ్జెట్ సినిమా అని, ఈ మూవీ కొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతుందని హరీష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో శేఖర్ మాస్టర్, మురళి, వాలిశెట్టి వెంకట సుబ్బారావు, కాశీవిశ్వనాథ్, వసంత్ తదితరులు పాల్గొన్నారు.