
తాజాగా నరుడా డోనరుడా టీమ్ ఆడియో విడుదల తేదీని కూడా ప్రకటించేసింది. అక్టోబర్ 27న నరుడా డోనరుడా పూర్తి ఆడియో మార్కెట్‌లోకి విడుదలవుతుందని టీమ్ తెలిపింది. కొత్త దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకల సంగీతం సమకూర్చారు. సుమంత్ సరసన పల్లవి సుభాష్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తనికెళ్ళ భరణి ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా తన కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చి పెద్ద హిట్‌గా నిలుస్తుందని సుమంత్ భావిస్తున్నారు.