ప్రియుడితో ఫారెన్ చెక్కేసిన పరిణితీ చోప్రా.. వైరల్ అవుతున్న ఫోటోస్..

Published : Jun 11, 2023, 07:58 AM IST
ప్రియుడితో ఫారెన్ చెక్కేసిన పరిణితీ చోప్రా.. వైరల్ అవుతున్న ఫోటోస్..

సారాంశం

చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు బాలీవుడ్ కపుల్ పరిణితీ చోప్రా.. రాఘవ్ చద్దా.. సైలెంట్ గా ఫారెన్ చెక్కేసిన ఈ జంట పెళ్ళికి ముందే తెగ తిరిగేస్తున్నారు. 

బాలీవుడ్‌ స్టార్‌ పరిణీతి చోప్రా.. ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.. చాలాకాలం నుంచి ఇది నడుస్తున్నా.. రీసెంట్ గా ఈ విషయం బయట పడింది. ఇక తాజాగా ఈ కపుల్  ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు ఫారెన్ టూర్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి  లండన్‌ లో వెకేషన్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ ను వీక్షించి సందడి చేశారు. 

 శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గ్యాలరీ నుంచి కొత్త జంట మాచ్ ను చూస్తూ.. సందడి చేశారు. ఇక వీరి ఫెటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్న రాఘవ్‌-పరిణీతి త్వరలో పెళ్ళి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే గత నెల 13వ తేదీన వీరి ఎంగేజ్‌మెంట్‌ ఢిల్లీలో ఘనంగా జరిగింది. రాజీవ్‌ చౌక్‌లోని కపుర్తాల హౌస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వేడుక జరిపించారు. 

ఇక ఈ ఏడాది అక్టోబర్‌ చివర్లో వీరు పెళ్ళి ఘనంగా చేయడానికి సన్నహాలు చేస్తున్నారట కుటుంబ సబ్యులు. ఈలోపు వీరు కొంతకాలంగా క‌లిసి వ‌రుస‌గా డిన్నర్‌ డేట్స్‌ ,లంచ్ మీటింగ్స్‌ , అంటూ చట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు. అంతేకాకుండా ముంబైలో జరిగిన పలు కార్యక్రమాలకు కూడా జంటగా హాజరయ్యారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని తర్వలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.  

మొదటి నుంచి స్నేహితులైన వీరు.. తమ స్నేహాన్ని ప్రేమగామలుచుకుని.. త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక వీరు చెట్టా పట్టాలువేసుకుని తిరుగుతూ.. తరచూ మీడియా కెమెరాలకు చిక్కుతున్నారు. రెస్టారెంట్లకు, డిన్నర్ డేట్లకు వెళ్తూ.. కెమెరాల కళ్లల్లో పడుతున్నారు. కాని వీరి బంధం గురించి మాత్రం చాలా కాలం నోరు మెదపలేదు ఇద్దరు. ఆ మధ్య ఐపీఎల్ మ్యాచ్ లో కూడా ఈసెలబ్రిటీ జంట హడావిడి చేశారు. ఇక పరిణితీ.. ప్రస్తుతం హిందీలో ఛమ్కీలా, క్యాప్య్సుల్‌ గిల్‌ చిత్రాల్లో నటిస్తోంది. ఇక రాఘవ్‌ చద్దా ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు