విడాకులకు సై అంటోన్న మరో బాలీవుడ్ జంట, ఫిల్మ్ ఇండస్ట్రీలో పెరుగుతున్న డివోర్స్ కేసులు

Published : Jun 10, 2023, 09:06 PM IST
విడాకులకు సై అంటోన్న మరో బాలీవుడ్ జంట, ఫిల్మ్ ఇండస్ట్రీలో పెరుగుతున్న డివోర్స్ కేసులు

సారాంశం

ఈ మధ్య స్టార్ సెలబ్రిటీలు ఎంత ఇష్టంగా పెళ్లి చేసుకుంటున్నారో.. అంతే సులువుగా విడిపోతున్నారు. ఈమధ్య ఈ విడిపోయేవారి సంఖ్యం పెరిగిపోతూ వస్తంది.  ఈ క్రమంలోనే తాజాగా మరో స్టార్ కపుల్ కూడా విడిపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఈ మధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత సులువుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారో.. అంతే ఈజీగా విడిపోతున్నారు. కొంత మందిఅయితే పెళ్లైన నెలల వ్యవదిలోనే విడిపోతున్నారు.  సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లతో పాటు బ్రేకప్ లు విడాకుల వార్తలు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఆమధ్య కన్నడ సీరియల్ జంట పెళ్లి చేసుకుని ముచ్చటగా మూడు నెలలు కూడా కాపురం చేయకుండానే విడాకులు తీసుకున్నారు.  ఇప్పటికే చాలా మంది కపుల్ తాము విడిపిపోతున్నామని అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. 

ఇక ఇందులో రకరకాల జంటలు ఉన్నారు. పెళ్ళైన రెండునెలలకు విడిపోయేవారు ఉన్నారు. రెండేళ్లకు.. మూడేళ్లకు.. అలాగే 18 ఏళ్లు కాపురం చేసిన తరువాత కూడా విడాకులు తీసుకున్న వారు కూడా ఉన్నారు. దాని బెస్ట్ ఎక్జాంపుల్ ధనుష్ ఫ్యామిలీనే. ఇక ఈ క్రమంలోనే తాజాగా మరో స్టార్ కపుల్ కూడా విడిపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు ఈ జంట ఎవరంటే.. ఫేమస్  బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్.. ఆమె భర్త. ఈ ఇద్దరు త్వరలో విడిపోబోతున్నట్టు సోషల్ మీడియా కోడై కూస్తోంది.  

నేహా కక్కర్ కు బాలీవుడ్ లో ఉన్న ఇమేజ్ అందరికి తెలిసిందే. ఈ బ్యూటిపుల్ సింగర్  బాలీవుడ్ లో పాడిన పాటలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అంతే కాదు ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇండియన్ ఐడల్ కు ఈమె జడ్జ్ గా కూడా వ్యవహరించింది. అయితే తనకు కెరీర్ లో కలిసి వచ్చిన మరో సింగర్  రోహన్‌ను  ప్రేమించి పెళ్లాడింది బ్యూటీ.  2020లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్ళి తరువాత కూడా చెట్టాపట్టాలువేసుకుని కనిపించిన ఈ జంట.. ఈమధ్య అస్సలు కనిపించడం లేదు. 

పైగా తాజాగా తనపుట్టిన రోజు సెలబ్రేషన్ ఫోటోలను  నేహా షేర్ చేసింది. ఈ ఫొటోల్లోనూ రోహన్ కనిపించలేదు.  సోషల్ మీడియాలో వీరికి సంబందించిన ఫోటోలు కూడా ఎక్కడ అతను కనిపించలేదు. కొద్దిరోజులుగా నేహా షేర్ చేస్తున్న ఏ  ఫొటోల్లో తన భర్త కనిపించకపోవడంతో ఈ జంటవిడిపోతున్నారన్న వార్తలు సూపర్ ఫాస్ట్ గా వైరల్ అయ్యాయి. మరి ఈ విషయంలో వారు స్పందిస్తారా.. ఇలానై సైలెంట్ గా ఏం మాట్లాడ కుండా విడిపోతారా అనేది చూడాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?