గీత గోవిందం ఎఫెక్ట్.. పది కోట్ల బంపర్ అఫర్!

Published : Nov 04, 2018, 05:22 PM IST
గీత గోవిందం ఎఫెక్ట్.. పది కోట్ల బంపర్ అఫర్!

సారాంశం

సినిమా ఇండస్ట్రీలో కెరీర్ ఎప్పుడు ఒకేలా ఉండదని అందరికి తెలిసిందే. టాలెంట్ నిరూపించుకోవడానికి సమయం చాలా పడుతుంది. కానీ కాస్త అదృష్టం తోడవ్వాలే గాని లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది

సినిమా ఇండస్ట్రీలో కెరీర్ ఎప్పుడు ఒకేలా ఉండదని అందరికి తెలిసిందే. టాలెంట్ నిరూపించుకోవడానికి సమయం చాలా పడుతుంది. కానీ కాస్త అదృష్టం తోడవ్వాలే గాని లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది. ఈ రోజుల్లో అలాంటి స్టార్స్ చాలా మంది ఉన్నారు. ఇక గత కొన్నేళ్లుగా దర్శకుడిగా ఉన్న పరశురామ్ గీత గోవిందం కంటే ముందు వరకు మీడియం రేంజ్ దర్శకుడు. 

కానీ ఎప్పుడైతే గీత గోవిందం రిలీజయ్యిందో అప్పుడే అతని రేంజ్ మారిపోయింది. 10కోట్లతో తెరకెక్కించిన ఆ సినిమా 60కోట్ల వరకు షేర్స్ ని అందించి బాక్స్ ఆఫీస్ డైరెక్టర్ గా పరశురామ్ కి మంచి గుర్తింపును ఇచ్చింది. ఇక ఇప్పుడు అతనితో వర్క్ చేయడానికి బడా నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. పరశురామ్ రెమ్యునరేష్ కూడా పెంచేందుకు సిద్ధంగా ఉన్నారట. 

దాదాపు 10 కోట్ల వరకు ఇవ్వడానికి ఒక సీనియర్ నిర్మాత సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పరశురామ్ మాత్రం గీత గోవిందం అనంతరం ఇంకా ఎవరితో సినిమా చేస్తారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. గీత ఆర్ట్స్ లోనే సినిమా ఉంటుందని అప్పట్లో టాక్ వచ్చినప్పటికీ దానిపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. మరి పరశురాం ఏ హీరోతో సినిమా చేస్తాడో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: హీరోలు ఒకరి తర్వాత ఒకరు..దుబాయ్ మోజు వెనుక ఇదే కారణం!
Amla Paul: కొడుకుతో క్యూట్ ఫోటోలని షేర్ చేసిన అమలాపాల్.. నెటిజన్ల విమర్శలు