తెలుగులో రెడీ అవుతోన్న మోహన్ లాల్ ఫాంటసీ థ్రిల్లర్..!

Published : Nov 04, 2018, 04:55 PM IST
తెలుగులో రెడీ అవుతోన్న మోహన్ లాల్ ఫాంటసీ థ్రిల్లర్..!

సారాంశం

తెలుగులో రెడీ అవుతోన్న మోహన్ లాల్ ఫాంటసీ థ్రిల్లర్..!

మలయాళం సినిమా మార్కెట్ 100కోట్లుందా అని అందరికి తెలిసేలా పలుసార్లు గుర్తు చేసిన నటుడు మోహన్ లాల్. కంప్లీట్ యాక్టర్ గా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ కథానాయకుడు ఏ సినిమా చేసిన అందులో ఎంతో కొంత కొత్తదనం ఉంటుంది. ప్రస్తుతం మోహన్ లాల్  ఒడియాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. 

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్ లాల్ డిఫరెంట్ క్యారెక్టర్ తో కనిపించనున్నాడు. ఆకారాలు మార్చే ఒక మృగంలా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇకపోతే సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. దగ్గుబాటి క్రియేషన్స్ పై సంపత్ కుమార్ అభిరాం సినిమా హక్కులను డీసెంట్ ఎమౌంట్ కి అందుకున్నారు. 

డిసెంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా మలయాళంతో పాటు తెలుగు ఒడియ ని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. ఫాంటసీ థ్రిల్లర్ లో రానున్న ఈ  సినిమా స్థాయి పెరిగేలా ఎన్టీఆర్ తో సినిమాలో వాయిస్ ఓవర్ ఇప్పించనున్నారని తెలుస్తోంది. జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ తో మోహన్ లాల్ నటించిన సంగతి తెలిసిందే.  

PREV
click me!

Recommended Stories

Dhurandhar 2: అతిక్ అహ్మద్‌కి ఉగ్రవాదులతో లింక్‌లు.. సంచలన నిజాలు బయటపెట్టిన డీజీపీ, వామ్మో ఇంత జరిగిందా ?
Chiranjeevi-Balakrishna: చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా? టాలీవుడ్‌లోనే అదొక సంచలనం