KGF-2 Trailer Launch:ట్రైలర్ ట్రీట్ కు రెడీ అయిన కెజియఫ్2.. తగ్గేదేలే అంటున్న యష్..

Published : Mar 03, 2022, 12:58 PM IST
KGF-2 Trailer Launch:ట్రైలర్ ట్రీట్ కు రెడీ అయిన కెజియఫ్2.. తగ్గేదేలే అంటున్న యష్..

సారాంశం

కన్నడ యంగ్ స్టార్ హీరో యష్ హీరోగా  సైలెంట్ గా వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టింది కెజియఫ్ మూవీ. ఇక ప్రస్తుతం భారీ అంచనాల నడుమ కెజియఫ్ ఛాప్టర్ 2 మూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది. 

కన్నడ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది కెజిఎఫ్. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి పాన్ ఇండియా వైడ్ భారీ విజయం సాధించింది. భారీ కలెక్షన్స్ ని కూడా రాబట్టింది. ఈ ఒక్క సినిమాతో కన్నడ సినీ పరిశ్రమ స్థాయి భారీగా పెరిగిపోయింది. కెజియఫ్ ముందు వరకూ.. పాన్ ఇండియా సినిమా కాని.. 100 కోట్ల కలెక్షన్స్ కాని తెలియదు కన్నడ పరిశ్రమకి. కెజియఫ్ తరువాత నుంచే  కన్నడ సినీ తలరాత పూర్తిగా మారిపోయింది. ఈ సినిమా 2018లో రిలీజ్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
 
కెజియ్ రిలీజ్ అయ్యి మూడేళ్లు పైనే అవుతున్నా ఇంకా ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు అంటే సినిమా ఆడియన్స్ ను ఎంతలా  మెస్మరైజ్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక కెజియఫ్ ఛాప్టర్ 2 కోసం మూడు సంవత్సరాలుగా అభిమానులు, సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. అయితే కరోనా వల్ల డిలే అవుతూ వస్తున్న కెజియఫ్2.... రెండు మూడు  రిలీజ్ డేట్లు మార్చుకుని, ఫైనల్ గా ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. 

ఈసారి పక్కా రిలీజ్ డేట్ ను మార్చేదే లే అంటున్నారు టీమ్. తగ్గేదే లే అంటున్నాడు యష్. అంతే కాదు ట్రైలర్ ట్రీట్ కు కూడా కెజియఫ్ టీమ్ రెడీ అవుతున్నారు. ఇక ఇప్పటికే కెజిఎఫ్2 నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు. యష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ టీజర్ 200 మిలియన్ల వ్యూస్ సాధించి యూట్యూబ్ లో రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ రికార్డు ని ఏ పాన్ ఇండియా సినిమా కూడా బద్దలు కొట్టలేకపోయింది. ఇక సినిమా కోసం కూడా జనాలు అంతలా ఎదురు చూస్తున్నారు అని చెప్పడానికి ఈ టీజర్ నిర్శనంగా నిలిచింది. 

ఇక రీసెంట్ గా కెజియఫ్2 నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ ట్రైలర్ ని మార్చి 27న సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులు, సినీ ప్రేక్షకులు ఈ ట్రైలర్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కెజియఫ్ 2 రిలీజ్ అయ్యి ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో అని సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. 

 

ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈమూవీని హోంబలే ఫిల్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈసారి పాన్ ఇండియాను దృష్టిలో పెట్టుకుని ఈమూవీలో ప్రశాంత్ నీల్ స్టార్స్ మల్టీ స్టార్స్ ను ప్లాన్ చేశాడు. అధీరాగా సంజయ్ దత్ చేస్తుండగా.. రవీనా టండన్ ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది. ఇటు ప్రకాశ్ రాజ్, రాము రమేష్ లాంటి స్టార్ కాస్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈమూవీ షూటింగ్ అయిపోగానే ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ స్టార్ట్ చేశారు. త్వరలో ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్ 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Mohan Babu చిరంజీవి అన్నదమ్ములుగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
Suma Rajeev Divorce: తల్లిదండ్రుల విడాకుల విషయంలో అసలు జరిగింది ఇదే.. చెప్పేసిన సుమ కొడుకు రోషన్