Pallavi Prashanth : రామ భక్తుడిగా మారిన పల్లవి ప్రశాంత్.. కాషాయ దుస్తుల్లో బిగ్ బాస్ విన్నర్

Published : Jan 23, 2024, 03:27 PM IST
Pallavi Prashanth : రామ భక్తుడిగా మారిన పల్లవి ప్రశాంత్.. కాషాయ దుస్తుల్లో బిగ్ బాస్ విన్నర్

సారాంశం

అయోధ్య రామాలయంలో బాల రాముడి విగ్రహా ప్రాణ్ ప్రతిష్ట వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ కాషాయ దుస్తుల్లో రాముడి ధ్యానిస్తూ ఆకట్టుకున్నారు. 

రైతు బిడ్డ, బిగ్ బాస్ తెలుగు 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ Pallavi Prashanth  ఇటీవల మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూ తనఫ్యాన్స్ ను నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో నిన్న అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహా ప్రతిష్ఠ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా హిందువులు రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. 

సెలబ్రెటీలు కూడా రాముడిపై భక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలో పాపులర్ రియాలిటీ షో బిగ్ బాగ్ తెలుగు Bigg Boss Telugu 7 Winner  పల్లవి ప్రశాంత్ రామ భక్తుడిగా మారిపోయాడు. తనదైన శైలిలో రఘురాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకను జరుపుకున్నాడు. ఈ క్రమంలో కాషాయ దుస్తులు, మాల ధరించి రామభక్తిని చాటుకున్నాడు. 

ఈ సందర్భంగా అభిమానులతో ఓ ఫొటోను పంచుకున్నారు. ఆ ఫొటోలో ఇలా కనిపించారు. వెనక చెరువు, చుట్టూ ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ధ్యానం చేస్తూ కనిపించాడు. తనలోని రామ భక్తిని ఇలా ప్రదర్శించినందుకు అభిమానులు, నెటిజన్లు పొగుడుతున్నారు. అభినందించారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. 

ఇదిలా ఉంటే.. 500 ఏళ్ల నాటి హిందువుల రామమందిరం కల నెరవేరింది. దీంతో నిన్న రామాలయం ప్రారంభోత్సవాన్ని దేశప్రజలు ఉత్సవంలా జరుపుకున్నారు.ప్రతి రామాలయంలో సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక మెగాస్టార్  చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, బాలీవుడ్ నటీనటులు కూడా వేడుకకు హాజరయ్యారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్
Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే