#Eagle ‘ఈగల్‌’ సోలో రిలీజ్ కోసం పిల్మ్ ఛాంబర్ ప్రయత్నాలు, వాళ్లకి లెటర్స్ ?

By Surya PrakashFirst Published Jan 23, 2024, 2:54 PM IST
Highlights

ఈగల్ సినిమాకి సోలో డేట్ ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలని పీపుల్స్‌ మీడియా విజ్ఞప్తి చేసింది. ఈగల్ సినిమా సోలోగా విడుదలయ్యేలా సహకరించాలని..


ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి ఐదు తెలుగు చిత్రాలు (2024 sankranthi movies) సందడి చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆ లిస్ట్ లోని ‘ఈగల్‌’ (eagle) వాయిదా పడింది. సంక్రాంతి సినిమాల విడుదలపై.. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌  సమావేశమయ్యాయి. రోజుల వ్యవధిలోనే ఐదు సినిమాలు విడుదలైతే ఎలాంటి పరిణామాలుంటాయనే దానిపై ఆయా నిర్మాతలతో సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ మేరకు ‘ఈగల్‌’ నిర్మాత తమ సినిమాని పోస్ట్‌పోన్‌ చేసేందుకు అంగీకరించారు.   రవితేజ చేసిన ఈ సాయానికి వారికి ఏ పోటీ లేకుండా ఒక సోలో రిలీజ్ డేట్ ఇచ్చామని, కొత్త విడుదల తేదీని  ప్రెస్ మీట్‌లో అనౌన్స్ చేశారు నిర్మాత దిల్ రాజు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇక్కడే ట్విస్ట్ పడింది.

 ఈగల్‌ సినిమాకు సింగిల్‌ రిలీజ్‌ డేట్‌గా ఫిబ్రవరి 9 ఫైనల్‌ చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఈగల్‌ సినిమాకు పోటీగా మరో మూడు సినిమాలు రంగంలోకి దూకుతున్నాయి. ఫిబ్రవరి 8న యాత్ర-2, ఊరు పేరు భైరవకోన చిత్రాలతో పాటు ఫిబ్రవరి 9న లాల్‌ సలామ్‌ విడుదల కానుంది. అంటే ఈగల్‌ సినిమాతో కలిపి మొత్తంగా నాలుగు సినిమాలు రిలీజ్ కు ఉన్నాయి. దాంతో ఇప్పుడు  ఈగల్‌ సినిమాకు సంబంధించిన పీపుల్స్‌ మీడియా వారు తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు లేఖ రాశారు.  సంక్రాంతికి రావాల్సిన ఈగల్ సినిమా ఛాంబర్ పెద్దల నిర్ణయం మేరకు, సినీ పరిశ్రమ మంచి కోసం తాము వాయిదా వేసుకున్నామని ఆ లేఖలో తెలిపారు.

Latest Videos

 ఈ క్రమంలో తమ ఈగల్‌ సినిమాకు సోలో రిలీజ్ డేట్ ఇస్తామని మాట ఇచ్చారు. కానీ తమ సినిమా రిలీజ్ రోజే మరి కొన్ని సినిమాలు విడుదల కానున్నాయని తెలిపారు. ఈగల్ సినిమాకి సోలో డేట్ ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలని పీపుల్స్‌ మీడియా విజ్ఞప్తి చేసింది. ఈగల్ సినిమా సోలోగా విడుదలయ్యేలా సహకరించాలని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ను కోరింది. ఈ లేఖకు ఎలాంటి సమాధానం ఇంకా వెలువడలేదు.  అయితే ఇప్పుడు ఎవరూ ఊహించని పరిమాణం ఇది..ఈ క్రమంలో ఇప్పుడు సోలో రిలీజ్ డేట్ కు ఇప్పుడు రంగం సిద్దం చేయాల్సిన భాద్యత దిల్ రాజు పై పడినట్లు అయ్యింది. 

అందుతున్న సమాచారం మేరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వారు ...డీజే డిల్లు 2, లాల్ సలాం,  యాత్ర 2, ఊరి పేరు భైరవకోన నిర్మాతలకు లెటర్స్ రాసినట్లు సమాచారం. రవితేజ చిత్రానికి సోలో రిలీజ్ ఇవ్వటం కోసం తమ సినిమాలను ఫిబ్రవరి 9 కు ఒక రోజు ముందుకు కానీ వెనక్కి కానీ షిప్ట్ చేయమని కోరుతూ లేఖలు రాసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఎన్ని థియేటర్స్ సినిమాలకు ఇచ్చామని కాకుండా ఈగల్ కు క్లియర్ రూట్ ఇచ్చి, సోలో రిలీజ్ కు సహకరించాలనేది ఆ లేఖల్లో స్పష్టంగా రాసారట. అయితే డిజే టిల్లు2 నిర్మాతలు తమ రిలీజ్ డేట్ మార్చుకోవటానికి ఓకే అన్నారట. అలాగే యాత్ర2 చిత్రం నిర్మాతలు కూడా రిలీజ్ ఓ రోజు ముందుకు జరుపుకోవటానికి ఓకే చెప్పారట.  ఇంక లాల్ సలాం, ఊరి పేరు భైరవకోన చిత్రాల నిర్మాతల నుంచి రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారట. ఈ రోజు ,రేపట్లో జరిగే మీటింగ్ లో మిగతా విషయాలపై క్లారిటీ వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది.  

click me!