మళ్లీ విలన్‌గా మారిపోయిన గోపీచంద్.. `పక్కా కమర్షియల్‌` ట్రైలర్‌ అదుర్స్..

Published : Jun 12, 2022, 04:36 PM IST
మళ్లీ విలన్‌గా మారిపోయిన గోపీచంద్.. `పక్కా కమర్షియల్‌` ట్రైలర్‌ అదుర్స్..

సారాంశం

హీరో గోపీచంద్‌ నటిస్తున్న సినిమా `పక్కా కమర్షియల్‌`. రాశీఖన్నా కథానాయికగా మారుతి రూపొందించిన ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. 

గోపీచంద్‌(Gopichand) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `పక్కా కమర్షియల్‌`(Pakka Commercial). రాశీఖన్నా(Raashi Khanna) కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు. జీఏ2, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీవాసు నిర్మించారు. ఈ చిత్రం జులై 1న విడుదల కానుంది. ఆదివారం సాయంత్రం చిత్ర ట్రైలర్‌ని (Pakka Commercial Trailer) విడుదల చేశారు. తాజాగా ఈ ట్రైలర్‌ యూట్యూబ్‌లో, సోషల్‌ మీడియాలో దూసుకుపోతుంది. ట్రెండింగ్‌ అవుతుంది. ఇందులో డైలాగ్‌లు, ఫన్నీ సీన్లు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.పూర్తి వినోదాత్మకంగా ఈసినిమా సాగుతుందని తెలుస్తుంది. 

అయితే హీరో గోపీచంద్‌ మరోసారి విలన్‌గా మారినట్టు చెప్పారు. తాను ఇందులో హీరో కాదని, విలన్‌ అని చెప్పడం విశేషం. `మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్` అంటూ ఆయన చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌ విజిల్స్ పడేలా ఉంది. `క్యారెక్టర్‌ని చంపేశారని కోర్ట్ కెక్కావా?` అని జడ్జ్ చెప్పడం, `క్రిమినల్స్ అంటే ఎవరనుకున్నావ్‌, మన పాలిట దేవుళ్లు` అని గోపీచంద్‌ చెప్పడం, `యుద్ధం ఆరంభం అయ్యింది` అని రాశీఖన్నా చెప్పే డైలాగ్‌, `కేజీఎఫ్‌ 1, 2, 3 చాలదు.. డైరెక్ట్‌ గా 10` కావాల్సిందే అని సత్య చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. 

`ఇప్పటికే విడుదలైన `పక్కా కమర్షియల్` టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. మూసాపేట్‌లోని ఏసియన్ సినిమాస్‌లో జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు. ‘మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ట్రైలర్ అంతా పక్కా కమర్షియల్ కోణంలో ఉంది. రాశీ ఖన్నా డైలాగ్స్ కూడా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. సత్యరాజ్, రావు రమేష్ పాత్రలు విభిన్నంగా డిజైన్ చేసారు మారుతి. గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా రాసారు. 

దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ - బ‌న్నీవాసు - కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది.

 గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత‌. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం` అని యూనిట్‌ తెలిపింది. 

నటీనటులు:

గోపీచంద్, రాశీఖ‌న్నా, స‌త్య‌రాజ్, రావు ర‌మేశ్, సప్తగిరి తదితరులు

టెక్నికల్ టీం: 

స‌మ‌ర్ప‌ణ - అల్లు అరవింద్
బ్యాన‌ర్ - జీఏ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్
నిర్మాత‌ - బ‌న్నీ వాస్
ద‌ర్శ‌కుడు - మారుతి
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ - ర‌వీంద‌ర్
మ్యూజిక్ - జ‌కేస్ బీజాయ్
స‌హ నిర్మాత - ఎస్ కే ఎన్
లైన్ ప్రొడ్యూసర్ - బాబు
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ - సత్య గమిడి
ఎడిటింగ్ - ఎన్ పి ఉద్భ‌వ్
సినిమాటోగ్ర‌ఫి - క‌ర‌మ్ చావ్ల‌
పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌ శ్యామ్

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?