RRR Movie: ఆర్ ఆర్ ఆర్ మూవీ @ 10000 

Published : Mar 24, 2022, 05:40 PM IST
RRR Movie: ఆర్ ఆర్ ఆర్ మూవీ @ 10000 

సారాంశం

ప్రతి నోటా ఆర్ ఆర్ ఆర్ (RRR Movie).. ప్రతి మదిలో ఆర్ ఆర్ ఆర్. ఇద్దరు టాప్ స్టార్స్ తో రాజమౌళి (Rajamouli)తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ పై ఉన్న అంచనాలు, హైప్ అంతా ఇంకా కాదు. డిమాండ్ కి తగ్గ సప్లై అన్నట్లు... ఈ మూవీ రికార్డు స్థాయిలో విడుదలవుతుంది.

విడుదలకు ముందే ఆర్ ఆర్ ఆర్ రికార్డుల మోత మోగిస్తుంది. ఆర్ ఆర్ ఆర్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే కొన్ని సినిమాల లైఫ్ టైం వసూళ్ల రికార్డు చెరిపేసింది ఆర్ ఆర్ ఆర్. యూఎస్ లో వన్ మిలియన్ మార్క్ చేరుకోవడం స్టార్ హీరోల సినిమాలకు కూడా కష్టం.  అలాంటిది ఆర్ ఆర్ ఆర్ దాదాపు $ 3 మిలియన్ వసూళ్లతో చరిత్ర సృష్టించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆర్ ఆర్ ఆర్ బుకింగ్స్ జోరు చూపిస్తున్నాయి. ఫస్ట్ డే ఆర్ ఆర్ ఆర్ ఏపీ/తెలంగాణలో రూ. 100 కోట్ల షేర్ అంచనా వేస్తున్నారు. మొదటిరోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్ల వసూళ్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. 

ఈ అంచనాలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ... ఆర్ ఆర్ ఆర్ మూవీపై ఉన్న హైప్ రీత్యా సాధ్యమే అనిపిస్తుంది. ఈ క్రమంలో ఆర్ ఆర్ ఆర్ విడుదల కూడా అదే స్థాయిలో ఉంది. హైదరాబాద్ నగరంలోని దాదాపు అన్ని థియేటర్స్ లో ఆర్ ఆర్ ఆర్ విడుదల చేస్తున్నారు. రాధే శ్యామ్, కాశ్మీర్ ఫైల్స్ చిత్రాలకు ఒకటి రెండు థియేటర్స్ మిగిల్చినట్లు సమాచారం. 

యూఎస్ లో ఏకంగా 1100 థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. యూఎస్ లో అన్ని వందల థియేటర్స్ లో విడుదలవుతున్న మొదటి ఇండియన్ మూవీ ఆర్ ఆర్ ఆర్ కావడం విశేషం. యూఎస్ తర్వాత ఇండియన్ సినిమాలకు ఆస్ట్రేలియాలో మంచి మార్కెట్ ఉంది. దీనితో అక్కడ కూడా రికార్డు స్థాయిలో ఆర్ ఆర్ ఆర్ విడుదలవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి ఆర్ ఆర్ ఆర్ 10000 థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లు సమాచారం. 

ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎలా ఉండబోతుందనే విషయం వదిలేసిన ప్రేక్షకులు ఫస్ట్ డే ఏ స్థాయిలో వసూళ్లు రాబడుతుందని ఆసక్తిగా గమనిస్తున్నారు. దర్శకుడు రాజమౌళి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కించారు. ఎన్టీఆర్ (NTR)కొమరం భీమ్, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. పలుమార్లు వాయిదా పడిన ఆర్ ఆర్ ఆర్ మార్చి 25న విడుదలవుతుంది. ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించగా... కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..