చిరునవ్వులు చిందిస్తూ డిశ్చార్జ్ అయిన ప్రకాష్ రాజ్.. డాక్టర్ ఏం చెప్పారంటే..

pratap reddy   | Asianet News
Published : Aug 16, 2021, 06:58 PM IST
చిరునవ్వులు చిందిస్తూ డిశ్చార్జ్ అయిన ప్రకాష్ రాజ్.. డాక్టర్ ఏం చెప్పారంటే..

సారాంశం

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల షూటింగ్ లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన చేతికి గాయం అయింది. దీనితో ప్రకాష్ రాజ్ మంగళవారం హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు.

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల షూటింగ్ లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన చేతికి గాయం అయింది. దీనితో ప్రకాష్ రాజ్ మంగళవారం హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. వైద్యులు ప్రకాష్ రాజ్ కి విజయవంతంగా సర్జరీ కూడా చేశారు. 

ఈ విషయాన్ని స్వయంగా ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ కోలుకోవడంతో వైద్యులు ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. 

ఈ విషయాన్ని ప్రముఖ డాక్టర్ గురువారెడ్డి స్వయంగా వెల్లడించారు. 'నా స్నేహితుడు ప్రకాష్ రాజ్ డిశ్చార్జ్ అయిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆయన ప్రస్తుతం బావున్నారు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. అతి త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై ప్రకాష్ రాజ్ ని చూడాలి' అని గురువా రెడ్డి ట్వీట్ చేశారు. బహుశా ప్రకాష్ రాజ్ కొన్ని రోజుల పాటు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. 

ఈ సందర్భంగా చిరునవ్వులు చిందిస్తున్న ప్రకాష్ రాజ్ తో ఉన్న ఫోటోని పోస్ట్ చేశారు. ప్రకాష్ రాజ్ భుజానికి కట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ పలు చిత్రాల్లో నటిస్తున్నారు. 

అలాగే మా ఎలక్షన్స్ లో బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ మా ఎన్నికల్లో పోటీకి దిగడం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ స్థానికత ప్రస్తావనకు వచ్చింది. ప్రకాష్ రాజ్ తో పాటు మంచు విష్ణు, జీవిత లాంటి ప్రముఖులు కూడా మా ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రకాష్ రాజ్ తెలుగులో ఈ ఏడాది పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో కనిపించారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?