మరో హిట్ డైరక్టర్ కు ఓకే చెప్పిన మెగాస్టార్?

Surya Prakash   | Asianet News
Published : Aug 04, 2021, 08:11 AM IST
మరో హిట్ డైరక్టర్ కు ఓకే చెప్పిన మెగాస్టార్?

సారాంశం

  చిరంజీవి వరసపెట్టి కథలు వింటూనే ఉన్నారు. తాజాగా మరో దర్శకుడుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. 

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వ‌ర‌స సినిమాలతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఆయన తాజా చిత్రం ఆచార్య  కంటిన్యూ షెడ్యూల్స్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే ఆచార్య త‌ర్వాత వేదాళం, లూసీఫ‌ర్ రీమేక్‌ల‌లో న‌టించ‌బోతున్నాడు చిరంజీవి. వీటిలో లూసిఫ‌ర్ రీమేక్ ముందుగా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. అలాగే బాబి దర్శకత్వంలోనూ ఆయన సినిమా చేయనున్నారు. అంతేకాదు ఆయన వరసపెట్టి కథలు వింటూనే ఉన్నారు. తాజాగా  ఆయన మరో దర్శకుడుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. 
 
ఆ డైరక్టర్ మరెవరో కాదు మారుది. సక్సెస్ ఫుల్  చిత్రాల దర్శకుడు మారుతి మెగాస్టార్ కు రీసెంట్ గా ఒక కథ వినిపించాడట. అదొక కామెడీ ఎంటర్టైనర్ అని సమాచారం. చిరుకి ఆ స్టోరీ లైన్  బాగా నచ్చేయడంతో వెంటనే గ్రీన్ సిగ్నల ఇచ్చేసినట్లు సమాచారం. అలాగే  మారుతి మొదటి నుంచి చిరుకు అభిమాని. ఎప్పటినుండో మెగాస్టార్ తో పనిచేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో అల్లు అర్జున్ తోనూ సినిమా చేయాలని ట్రైల్స్ వేస్తున్నారు. చివరకు చిరుకు సెట్ అయ్యిందని వినికిడి. 

అయితే ఫైనల్ గా టోటల్ స్క్రిప్టు నేరేషన్ ఇచ్చి ఓకే చేయించుకోమని చిరు చెప్పారట. అలాగే వెంటనే ఈ ప్రాజెక్టు ప్రారంభం కాదు. చిరు ఓకే చేసిన సినిమాలు అన్ని పూర్తయ్యాక ఈ సినిమా మొదలు కానుంది. ఇక ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్  నిర్మించబోతున్నారని చెప్పుకుంటున్నారు.  గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. త్వరలోనే అధికారిక  ప్రకటన వచ్చే అవకాసం ఉంది.  

మారుతి విషయానికి వస్తే ...కొద్ది కాలం క్రితం.. సాయి ధరమ్ తేజ్ హీరోగా.. రాశీ ఖన్నా హీరోయిన్‌గా ‘ప్రతిరోజు పండగే’ అనే సినిమాతో మారుతి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యింది. ప్రస్తుతం ఆయన గోపిచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’, దాంతో పాటు సంతోష్ శోభన్ హీరోగా ‘మంచి రోజులు వచ్చాయి’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు చిత్రాల పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. మినిమం గ్యారెంటీ దర్శకుడుగా ఆయనకు పేరుంది. 
 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది
చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?