AVAK: మహేష్ సినిమా ఎఫెక్ట్....రిలీజ్ తర్వాత ఓటిటి రీ-డీల్

Surya Prakash   | Asianet News
Published : May 09, 2022, 06:35 AM IST
AVAK: మహేష్ సినిమా ఎఫెక్ట్....రిలీజ్ తర్వాత ఓటిటి రీ-డీల్

సారాంశం

శనివారం రాత్రి, ఆదివారం ఈ సినిమా కలెక్షన్స్ బాగా వచ్చినట్లు సమాచారం. అయితే వచ్చేవారం ఈ సినిమా మహేష్ బాబు తాజా చిత్రం సర్కారు వారి పాటను తట్టుకుని నిలబడుతుందా అనేదే ప్రశ్న.  

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌  తాజా చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'. మొన్న శుక్రవారం రిలీజైన ఈ సినిమాలో  'అల్లం అర్జున్‌'గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసారు. విశ్వక్ సేన్‌ సరసన రుక్సార్‌ దిల్లాన్ హీరోయిన్‌గా అలరించిన ఈ మూవీకి  విద్యాసాగర్‌ చింతా దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్‌లు, టీజర్‌, ట్రైలర్‌ విభిన్నంగా ఆకట్టుకున్నాయి. అలాగే సినిమా ప్రమోషన్‌లో భాగంగా చేసిన చర్యలు పలు విమర్శలను కూడా మూటగట్టుకున్నాయి. విశ్వక్ సేన్‌కు ఓ టీవీ యాంకర్‌కు మధ్య జరిగిన కాంట్రవర్సీ తెలిసిందే.  ఆ ప్రమోషన్ తో అశోకవనంలో అర్జున కల్యాణం థియేటర్లలో విడుదలైంది.  అల్లం అర్జున్‌గా విశ్వక్ సేన్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి.  జస్ట్ యావరేజ్ సినిమా అనిపించుకున్నాడు. 

అయితేనేం ఈ వారం రిలీజైన మిగతా రెండు సినిమాలు కూడా సోసో గా ఉండటం,ఫ్యామిలీ ఆడియన్స్ చూడదగ్గ సినిమా కావటంతో వీకెండ్ లో చాలా చోట్ల  హౌస్ ఫుల్స్ అయ్యాయి. శనివారం రాత్రి, ఆదివారం ఈ సినిమా కలెక్షన్స్ బాగా వచ్చినట్లు సమాచారం. అయితే వచ్చేవారం ఈ సినిమా మహేష్ బాబు తాజా చిత్రం సర్కారు వారి పాటను తట్టుకుని నిలబడుతుందా అనేదే ప్రశ్న.  ఈ నేపధ్యంలో ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా ఓటిటిలోకి తెద్దామనే నిర్ణయానికి వచ్చారని వినికిడి.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటిటి రైట్స్ ఆల్రెడీ ఆహా వారి దగ్గర ఉన్నాయి. అయితే రిలీజైన నెల తర్వాతే ఓటిటికు వచ్చేలా ఎగ్రిమెంట్. కానీ సర్కారు వారి పాట తర్వాత థియోటర్స్ లో ఈ సినిమా నిలబడటం ప్రాక్టికల్ గా కష్టమే కాబట్టి....మూడు వారాల్లో ఓటిటి రిలీజ్ కు వచ్చేలా ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. ఆల్రెడీ ఎగ్రిమెంట్ అయిన ఎమౌంట్ కు డబుల్ ఇచ్చి లాక్ చేసినట్లు సమాచారం. నిర్మాతకు ఇది ఊహించని లాభమే. అయితే మంచి రేటు పెట్టి కొనుకున్న డిస్ట్రిబ్యూటర్స్ ఆదాయానికి ఇది గండి కొడుతుంది. అయితే చాలా చోట్ల రికవరీ ఉందని , తక్కువ రేట్లకే సినిమా తీసుకున్న ఏరియాలు వారు ఒడ్డున పడిపోతారని అంటున్నారు. కొన్ని ఏరియాల్లో పెద్ద ఎమౌంట్లు రాకపోయినా, మినిమం ప్రాఫిట్ ఉంటుందంటున్నారు. 
  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..
500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా