Nithiin: ‘మాచర్ల నియోజకవర్గం’ రిలీజ్ వాయిదా, కొత్త డేట్ పోస్టర్ అదిరింది

Surya Prakash   | Asianet News
Published : May 09, 2022, 06:17 AM IST
Nithiin: ‘మాచర్ల నియోజకవర్గం’ రిలీజ్ వాయిదా, కొత్త డేట్ పోస్టర్ అదిరింది

సారాంశం

మాచర్ల నియోజకవర్గంలోని గుంటూరు జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థ్‌ రెడ్డి పాత్రలో అలరించనున్నాడు నితిన్. ఈ కొత్త పోస్టర్ లో బ్లూ జీన్స్ వైట్ షర్టులో టక్ చేసుకొని, హాండ్స్ ని పోల్డ్ చేస్తున్న స్టిల్ లో నితిన్ సాలిడ్ గా కనిపించాడు.  


నితిన్‌ హీరోగా తెరకెక్కుతున్న విభిన్న యాక్షన్‌ డ్రామా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎం.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి దర్శకుడు. రీసెంట్ గా ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్లకు మంచి   లభించింది.  టీజర్‌లో మాచర్ల నియోజకవర్గం సినిమాను జూలై 8న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడా తేదీ ఆగస్ట్ 12కు మారింది. సినిమాకి సంబంధించిన  పనులు పూర్తి కాకపోవటంతో రిలీజ్ డేట్ ను వాయిదా వేయక తప్పలేదని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో సిద్ధార్థ్‌ రెడ్డి అనే ఐఎఎస్ ఆఫీసర్ పాత్రలో నితిన్ కనిపించబోతున్నాడు.

 లేటెస్ట్ రిలీజ్ డేట్ తో వెలువడిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలిపారు. 'డేట్‌ మారింది అంతే.. కలెక్టర్‌ సార్‌ యాక్షన్‌ కాదు..' అంటూ ట‍్వీట్‌ చేశారు. ఈ పోస్టర్‌లో వైట్ షర్ట్‌లో మాస్‌ లుక్‌తో ఆకట్టుకున్నాడు నితిన్. కాగా మాచర్ల నియోజకవర్గంలోని గుంటూరు జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థ్‌ రెడ్డి పాత్రలో అలరించనున్నాడు నితిన్. ఈ కొత్త పోస్టర్ లో బ్లూ జీన్స్ వైట్ షర్టులో టక్ చేసుకొని, హాండ్స్ ని పోల్డ్ చేస్తున్న స్టిల్ లో నితిన్ సాలిడ్ గా కనిపించాడు. స్టైలిష్‌గా కనిపిస్తూనే మాస్ యాక్షన్ లుక్స్ తో దూకుడు చూపించాడు నితిన్.

 
‘మాచర్ల..’లో నితిన్‌ ఇప్పటి వరకు కనిపించని కొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నారు.   రాజకీయ నేపధ్యంలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న’మాచర్ల నియోజకవర్గం’ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌ రెడ్డి, నిఖితారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..