#Liger:‘లైగర్’రిలీజ్ ఏ OTT లో? ..ఎప్పటి నుంచి?

Published : Aug 26, 2022, 11:01 AM IST
#Liger:‘లైగర్’రిలీజ్  ఏ  OTT లో? ..ఎప్పటి నుంచి?

సారాంశం

  సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన  సినిమా ‘లైగర్’.ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించగా నిన్న గురువారం భారీ స్దాయిలో రిలీజైంది. ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించింది.వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించాడు.


  విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన ‘లైగర్’ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఆ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో, ఈ చిత్రానికి అదిరిపోయే  ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ, నెగిటివ్ రివ్యూల కారణంగా మాట్నీ నుంచి స్లో అయ్యిపోయింది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, ‘లైగర్’ మొదటి రోజు దాదాపు రూ. 24 దాకా కోట్లు రాబట్టినట్లు అంచనా. ‘లైగర్’ ఈ వారాంతంలో ఎలా నడుస్తుందనే దానిపై సినిమా ఓవరాల్ కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. ఇక నెగిటివ్ టాక్ రాగానే చాలా మంది ఓటిటిలో ఈ సినిమా చూడాలని ఫిక్స్ అయ్యిపోయారు. ఈ నేపధ్యంలో  ఓటిటి డిటేల్స్ చూస్తే...

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...ఈ సినిమాను ప్రముఖ దిగ్గజ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ వారు కొనుగోలు చేసారు. సాధారణంగా సినిమా తేడా కొడితే ఓ నెల లోపులో ఓటిటిలో ప్రత్యక్ష్యమయిపోతోంది. కానీ ఇప్పుడు మారిన ఓటిటి రూల్స్ నేఫధ్యంలో  ఈ సినిమా కూడా దాదాపు 50 రోజులు తర్వాతే ఓటిటి లో అందుబాటులోకి రావొచ్చని సమాచారం. 

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించి ఈ స్పోర్ట్స్ డ్రామాను చిత్రబృందం జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. దేశ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించడంతో అన్ని భాషల్లో భారీగా అడ్వాన్స్ డ్ బుక్సింగ్స్ వచ్చాయి. దాంతో, బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ ఓపెనింగ్‌ లభించింది. కానీ, మధ్యాహ్నంలోపే రివ్యూలు బయటికి రావడం, బాక్సాఫీస్ వద్ద నెగిటివ్ మౌత్ టాక్ రావడం ప్రతికూల ప్రభావం చూపింది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, మకరంద్ దేశ్‌పాండే, అలీ, బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రల్లో నటించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి