#Liger:‘లైగర్’డిజాస్టర్ టాక్, ఎంత పోవచ్చు?

By Surya Prakash  |  First Published Aug 26, 2022, 9:20 AM IST

ఈ ఏడాది అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రాల్లో ‘లైగర్’ ఒకటి. కంటెంట్ బాగుంటే ఇది అతనికి అద్భుతమైన చిత్రం కావచ్చు. కమర్షియల్‌గా ‘లైగర్’ బాగా రాణిస్తే, విజయ్ కి ఇక తిరుగుండదు. బాలీవుడ్ లో పెద్ద స్టార్ అయిపోతాడు


‘లైగర్’ చిత్రంతో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. గురువారం విడుదలయ్యిన  ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం ప్రమోషన్లలో దేశంలో ఎక్కడికి వెళ్లినా అభిమానులు విజయ్ కి బ్రహ్మరథం పట్టారు. అన్ని రాష్ట్రాల్లో విజయ్ కి అభిమానులు పెరిగిపోయారు. బాలీవుడ్ స్టార్లకు తీసిపోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు విజయ్ సొంతమైంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం  తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మార్నింగ్ షోకే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చేసింది. సినిమా డిజాస్టర్ అని తేల్చేసారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బడ్జెట్ ఎంత....ఎంత పోయే అవకాసం ఉందనే అంచనాలు ట్రేడ్ లో మొదలయ్యాయి.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు #Liger సినిమాకు 165 కోట్ల బడ్జెట్ అయ్యింది. వరంగల్ శ్రీను 67 కోట్లకు తెలుగు రెండు రాష్ట్రాల థియేటర్ రైట్స్ తీసుకున్నారు. ఆయనకు మాగ్జిమం 30 దాకా పోయే అవకాసం ఉందంటున్నారు. కరణ్ జోహార్ ...హిందీ వెర్షన్ ని కమీషన్ బేసిస్ మీద ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన 50 దాకా పోతుందని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ మొదటి రోజు వచ్చిన టాక్ కు వేసుకుంటున్న లెక్కలే. 

Latest Videos

ఇక ‘లైగర్’ ముందు వరకు విజయ్ దేవరకొండ ఒక్కో సినిమాకు రూ. 6 నుంచి 7 కోట్లు పారితోషికంగా తీసుకునేవాడని అంటారు.  అయితే ఇప్పుడు ‘లైగర్’ కోసం విజయ్ ఏకంగా 20-25 కోట్లు తీసుకున్నాడట. అందులో ఇప్పుడు కొంత వెనక్కి ఇచ్చే అవకాసం ఉందంటున్నారు. ‘లైగర్’ బ్లాక్ బస్టర్ అయితే విజయ్ దేవరకొండ తన పారితోషికాన్ని మరింత పెంచుకోవచ్చని  ఎగ్రిమెంట్ రాసుకున్నారట. ఒకవేళ ఈ చిత్రం ‘ఆర్ఆర్ ఆర్’, ‘పుష్ప’, ‘కేజీఎఫ్2’ స్థాయిలో హిట్ అయితే చిత్ర నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి, కరణ్ జోహార్ తో కలిసి విజయ్ లాభాల్లో వాటా కూడా పంచుకునే అవకాశం ఉంది.  కానీ ఇప్పుడా సిట్యువేషన్ కనపడటం లేదు.

విజయ్, హీరోయిన్ అనన్య పాండే ఈ సినిమాను 40 రోజుల పాటు ప్రమోట్ చేశారు. దేశవ్యాప్తంగా  పలు ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొని చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేశారు. ఈ నేపథ్యంలో ‘లైగర్’ కంటెంట్ సగటు కంటే ఎక్కువ ఉంటే ఇది పెద్ద హిట్ కాబోతోందని  ట్రేడ్ అనలిస్ట్ లు అభిప్రాయపడ్డారు. కానీ కంటెంట్ దారుణంగా ఉండటంతో డిజాస్టర్ రిజల్ట్ వచ్చింది. 

 

click me!