ఆసుపత్రి బెడ్ పై దయనీయ స్థితిలో అషురెడ్డి... కనీసం నడవలేక...

Published : Mar 14, 2023, 02:58 PM ISTUpdated : Mar 15, 2023, 10:47 AM IST
ఆసుపత్రి బెడ్ పై దయనీయ స్థితిలో అషురెడ్డి... కనీసం నడవలేక...

సారాంశం

బోల్డ్ బ్యూటీ అషురెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అషురెడ్డి దీనస్థితి చూసిన నెటిజెన్స్ త్వరగా కోలుకోవాలని కోరుంటున్నారు.   

అషురెడ్డి సడన్ గా ఆసుపత్రి బెడ్ పై కనిపించారు. ఆమె చేతికి సెలైన్ సూదులు ఉన్నాయి . నీరసంగా పడుకొని ఉన్నారు. అలాగే ఆమె కుంటుతున్నారు. అతి కష్టంగా నడుస్తున్నారు. లేడిలా చెంగు చెంగున తిరిగే అషురెడ్డికి ఏమైందనే అనుమానాలు మొదలయ్యాయి. ఆమె ఇబ్బంది పడుతూ నడుస్తున్న వీడియో వైరల్ అవుతుంది. అషురెడ్డి అనారోగ్యం పాలయ్యారని తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని  కామెంట్స్ పెడుతున్నారు. 

అషురెడ్డికి భారీ ఎత్తున సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది. ఆమె తరచుగా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ కాకరేపుతుంటారు. అషురెడ్డి స్కిన్ షోను విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆ విమర్శలు అషురెడ్డి అసలు పట్టించుకోదు. పై పెచ్చు కామం మీ కళ్ళలో ఉంది నా బట్టలో ఎలాంటి తప్పు లేదంటుంది. విమర్శించే వాళ్లకు సెటైర్స్ వేస్తూ... వీడియోలు పోస్ట్ చేస్తుంది. 

అమెరికాలో ఉండే అషురెడ్డి సోషల్ మీడియా స్టార్ గా పాపులర్ అయ్యింది. ఆమెను ఫ్యాన్స్ జూనియర్ సమంత అని పిలిచేవారు. బిగ్ బాస్ సీజన్ 3లో ఛాన్స్ దక్కించుకుని మరింత ఫేమ్ తెచ్చుకుంది. పెద్దగా రాణించకున్నా వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అషురెడ్డి పాల్గొన్నారు. ఆ మధ్య కొన్ని బుల్లితెర షోలలో సందడి చేశారు. ప్రస్తుతం నటిగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నారు. 

దర్శకుడు వర్మతో అషురెడ్డి చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలు సంచలనం రేపాయి. అషురెడ్డి ప్రైవేట్ పార్ట్స్  ని వర్ణిస్తూ వర్మ పచ్చి కామెంట్స్ చేశారు.  వర్మ-అషురెడ్డి కాంబోలో రెండు ఇంటర్వ్యూలు వచ్చాయి. రెండో ఇంటర్వ్యూలో వర్మ అషురెడ్డి పాదాలను ముద్దాడడం, వేళ్ళు నోట్లో పెట్టుకోవడం మరింత సంచలనమైంది. బోల్డ్ చర్యలతో విమర్శలపాలయ్యే అషురెడ్డిలో మరో కోణం కూడా ఉంది. ఆమె తన సంపాదనలో కొంత అనాధల కోసం ఖర్చు చేస్తుంటారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా