Oscar Awards 2026 : 98వ ఆస్కార్ అవార్డు విజేతలు వీరే.. ఎవరెవరిని వరించిందంటే?

Published : Mar 16, 2026, 07:23 AM IST
oscar 2026

సారాంశం

సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 98వ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా హాలీవుడ్ సహా ప్రపంచ సినీ పరిశ్రమ మొత్తం ఆస్కార్ అవార్డ్స్‌పై దృష్టి పెట్టింది.

ఘనంగా 98వ ఆస్కార్ అవార్డుల వేడుక..

ఈ ఏడాది అవార్డుల వేడుకలో పలు సినిమాలు ప్రధాన విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకున్నాయి. ముఖ్యంగా ‘ఫ్రాంకెన్‌స్టైన్’, ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’, ‘సిన్నర్స్’ వంటి చిత్రాలు పలు విభాగాల్లో విజేతలుగా నిలిచాయి.ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో ‘ఫ్రాంకెన్‌స్టైన్’ చిత్రం విజేతగా నిలిచింది. ఈ చిత్రానికి టమారా డెవరెల్ ప్రొడక్షన్ డిజైన్ నిర్వహించగా, షేన్ వియో సెట్స్ బాధ్యతలు నిర్వహించారు. ‘హామ్నెట్’, ‘మార్టీ సుప్రీమ్’, ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’, ‘సిన్నర్స్’ చిత్రాలు ఈ విభాగంలో నామినేషన్లు పొందాయి.

ఆస్కార్ లో సత్తా చాటిన అవతార్..

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ‘అవతార్: ఫైర్ అండ్ అష్’ విజేతగా నిలిచింది. ఈ చిత్రానికి జో లెటెరి, రిచర్డ్ బెనెహామ్, ఎరిక్ సైన్డన్, డానియెల్ బారెట్ విజువల్ ఎఫెక్ట్స్ అందించారు. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో ‘సిన్నర్స్’ చిత్రానికి ర్యాన్ కూగ్లర్ అవార్డు అందుకున్నారు. అదే సమయంలో ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగంలో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రానికి పాల్ థామస్ ఆండర్సన్ అవార్డు అందుకున్నారు.ఉత్తమ కాస్టింగ్ విభాగంలో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రానికి కాసాండ్రా కులుకుండిస్ విజేతగా నిలిచారు.

ఉత్తమ నటీనటులు ఎవరంటే?

నటీనటుల విభాగాల్లో కూడా ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. ఉత్తమ సహాయ నటి అవార్డు ‘వెపన్స్’ చిత్రానికి గాను ఏమీ మాడిగన్ ఆస్కార్ ను అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడు విభాగంలో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రానికి గాను షాన్ పెన్ అవార్డు అందుకున్నారు.

ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో ‘కేపాప్ డెమన్ హంటర్స్’ విజేతగా నిలిచింది. మ్యాగీ కాంగ్, క్రిస్ అప్పెల్‌హాన్స్, మిచెల్ ఎల్.ఎం. వాంగ్ ఈ చిత్రాన్ని రూపొందించారు.యటెక్నికల్ విభాగాల్లో కూడా పలు చిత్రాలు అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ , ఉత్తమ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్ విభాగాల్లో ‘ఫ్రాంకెన్‌స్టైన్’ చిత్రం అవార్డులను గెలుచుకుంది.

షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ అవార్డును ‘ది సింగర్స్’ , ‘టూ పీపుల్ ఎక్స్చేంజింగ్ సలైవా’ చిత్రాలు సంయుక్తంగా గెలుచుకున్నాయి. అలాగే ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ అవార్డును ‘ది గర్ల్ హూ క్రైడ్ పెర్ల్స్’ చిత్రం కైవసం చేసుకుంది.ఈ విధంగా 98వ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమం సినీ ప్రపంచంలో మరో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల టికెట్ల రేట్లు పెంచాం..దేహీ అని అడుక్కోవద్దు, పవన్ కామెంట్స్
Ravi Mohan: మ్యాచింగ్ డ్రెస్ పై ఆర్తి రవి సెటైర్ వైరల్.. ఎవరిని ఉద్దేశించి ఇలా