టాలీవుడ్ 90 ఇయర్స్ వేడుకలు మలేషియాలో నిర్వహిస్తాం..మంచు విష్ణు

By tirumala ANFirst Published Mar 23, 2024, 3:14 PM IST
Highlights

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప చిత్రంలో నటిస్తున్నాడు. మంచు విష్ణు కేరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో కన్నప్ప చిత్రం తెరకెక్కుతోంది. చాలా కాలంగా మంచు విష్ణుకి సరైన హిట్ లేదు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప చిత్రంలో నటిస్తున్నాడు. మంచు విష్ణు కేరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో కన్నప్ప చిత్రం తెరకెక్కుతోంది. చాలా కాలంగా మంచు విష్ణుకి సరైన హిట్ లేదు. శివ భక్తుడిగా నటిస్తున్న కన్నప్ప చిత్రం అయినా తనకి విజయాన్ని అందిస్తుంది అని విష్ణు భావిస్తున్నాడు. 

మరోవైపు మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మంచు విష్ణు మీడియా సమావేశంలో కీలక ప్రకటన చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ 90 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ వేడుకల్ని మలేషియాలో నిర్వహించబోతున్నట్లు మంచు మంచు విష్ణు తెలిపారు. 

ఈ వేడుకల్ని జులై లో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు మంచు విష్ణు తెలిపారు. సినీ పెద్దలతో చర్చించి డేట్ ని ఫైనలైజ్ చేస్తాం. భారత చిత్ర పరిశ్రమలో తెలుగు సినిమా చాలా గొప్పది. మనమంతా తెలుగు నటులుగా ఉన్నందుకు గర్వపడాలి అని మంచు విష్ణు అన్నారు. 

తెలుగు సినిమా ఘనకీర్తిని తొడగొట్టి చాటి చెప్పే ఉద్దేశంతోనే ఈ వేడుకలు నిర్వహించబోతున్నట్లు మంచు విష్ణు తెలిపారు. ఆ వేడుకలు నిర్వహించేందుకు జులై లో టాలీవుడ్ లో మూడు రోజులపాటు సెలవులు అవసరం. దీనితో ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు గారితో మాట్లాడం. ఆయన సానుకూలంగా స్పందించినట్లు మంచు విష్ణు తెలిపారు. మా ప్రెసిడెంట్ గా మంచు విష్ణు ఈ వేడుకల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. 

click me!