
ప్రభాస్ నటించిన `సలార్` సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతుంది. కానీ క్రమంగా కలెక్షన్లు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ మూవీ పదిరోజుల్లో ఆరు వందల కోట్లు కలెక్ట్ చేసింది. చాలా చోట్ల ఇంకా బ్రేక్ ఇవెన్ కాలేదు. ఓవర్సీస్‌లో లాభాల్లో సాగుతున్నా, ఇండియాలో మాత్రం అన్ని చోట్ల ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌కి దూరంగానే ఉంది. ఇంకా వంద కోట్లకుపైగా గ్రాస్ సాధిస్తేనే బ్రేక్ ఈవెన్‌కి అవకాశం ఉంది. అయితే ఎంత చేసినకొన్ని చోట్ల మాత్రం ఈ సినిమా కొన్న బయ్యర్లకి నష్టాలు తప్పేలా లేవు.
తమిళంలో నష్టాలు తప్పవు, అలాగే కేరళాలోనూ స్వల్పంగా ఈ మూవీ నష్టాలను మిగిల్చే అవకాశం ఉంది. నైజాంలోనూ బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే. ఏపీలో పర్వాలేదనిపిస్తుంది. కన్నడలో ఇప్పటికే డ్రాప్ అయ్యింది. అక్కడ హోంబలే ఫిల్మ్స్ సొంతంగా రిలీజ్ చేసిన నేపథ్యంలో వాళ్లకి సొంత రాష్ట్రంలో నష్టాలు తప్పేలా లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి అక్కడ మాత్రం మరో షాక్ తగిలింది. లోకల్ సినిమా గట్టి దెబ్బ కొట్టింది.
కన్నడలో `సలార్` పది రోజుల్లో 35కోట్ల గ్రాస్ వసూలు చేస్తే, స్థానిక సినిమా రెండో రోజుల్లో ఆ మార్క్ ని దాటేసింది. అక్కడ ఈ శుక్రవారం దర్శన్ హీరోగా నటించిన `కాటేరా` సినిమా విడుదలైంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో చాలా రస్టిక్ కంటెంట్‌తో ఈ మూవీ వచ్చింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. కన్నడలో ఈ మూవీ కేవలం రెండు రోజుల్లోనే 37కోట్లు వసూలు చేసింది. మూడు రోజుల్లో ఇది యాభై కోట్లు దాటింది. `సలార్`ని గట్టిగా దెబ్బకొట్టింది. అది భారీ కలెక్షన్ల దిశగా వెళ్తుంది. దీంతో ఇక కన్నడలో `సలార్` పూర్తిగా డ్రాప్ అయ్యేలా కనిపిస్తుంది. ఇకపై అక్కడ థియేటర్లు ఎత్తేయాల్సిన పరిస్థితి. `సలార్` థియేటర్లు `కాటేరా`కి కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది.
కన్నడలో ఇంతగా పడిపోవడానికి కారణం.. అక్కడ `ఉగ్రం` సినిమాని ఆల్‌రెడీ చేశారు. `సలార్`.. ఉగ్రం సినిమాకి ఎక్స్ టెన్షన్ అని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పిన విషయం తెలిసిందే. ఆ కథ సరిగా వెళ్లలేదని, దాన్ని మరింత లావిష్ స్కేల్‌లో `సలార్` గా తీసినట్టు దర్శకుడు తెలిపారు. దీంతో అక్కడి ఆడియెన్స్ సినిమాని చూసేందుకు ఇష్టపడటం లేదు. ఆ ప్రభావం `సలార్`పై గట్టిగా పడింది. అందుకే ఆశించిన స్థాయిలో ఆడటం లేదు.
దీనికితోడు సినిమాలో ఫ్యామిలీ ఎలిమెంట్లు లేవు. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాకి దూరమయ్యారు. మాస్, యాక్షన్ ఎలిమెంట్లు, ఎలివేషన్లు ఫ్యాన్స్ ని, మాస్ ఆడియెన్స్ ని, యూత్‌ని ఆకట్టుకుంటున్నాయి. కానీ ఫ్యామిలీ ఆడియెన్స్ వచ్చినప్పుడే సినిమా పెద్ద హిట్ అవుతుంది. నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుంది. కానీ ఈ చిత్రానికి ఆ ఆడియెన్స్ దూరమయ్యారు. ఇక ఈ చిత్రానికి పార్ట్ 2 `సలార్ 2` రాబోతుంది. మార్చి నుంచి రెండో పార్ట్ ప్రారంభం కానుందని తెలుస్తుంది. సినిమాని నెక్ట్స్ లెవల్‌లో తెరకెక్కిస్తానని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పిన విషయం తెలిసిందే. ఇక `సలార్`లో ప్రభాస్‌తోపాటు శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీరావు, సప్తగిరి వంటి వారుముఖ్య పాత్రలు పోషించారు.