Allu Arjun : ఇయర్ ఎండింగ్ లో అల్లు అర్జున్ ఎమోషనల్.. ఐకాన్ స్టార్ శ్రేయోభిలాషుల కోసం ప్రత్యేకమైన పోస్టు

Published : Dec 31, 2023, 08:38 PM ISTUpdated : Dec 31, 2023, 08:45 PM IST
Allu Arjun :  ఇయర్ ఎండింగ్ లో అల్లు అర్జున్ ఎమోషనల్.. ఐకాన్ స్టార్ శ్రేయోభిలాషుల కోసం ప్రత్యేకమైన పోస్టు

సారాంశం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Allu Arjun తాజాగా అభిమానులు, శ్రేయోభిలాషులను ఉద్దేశించి ప్రత్యేకమైన పోస్టు పెట్టారు. 2023కు వీడ్కోలకు పలుకుతూనూ బెస్ట్ మూమెంట్స్ ను గుర్తు చేసుకున్నారు. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మరింతగా పెరిగిపోయింది. ఈ సందర్భంగా బన్నీ తన అప్ కమింగ్ ఫిల్మ్స్ కోసం ఎంతగానో శ్రమిస్తున్నారు.  ఇప్పటికే ‘పుష్ప’తో అల్లు అర్జున్ ఏ స్థాయికి ఎదిగారో తెలిసిందే. ప్రస్తుతం ‘పుష్ప2 ది రూల్’ Pushpa 2 The Rule చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. షూటింగ్ కొనసాగుతోంది. ఆడియెన్స్ కు తన బెస్ట్ అందించేందుకు కృషి చేస్తున్నారు. 

ఇక తాజాగా బన్నీ ఇయర్ ఎండింగ్ సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇన్ స్టా స్టోరీ హ్యాండిల్ లో ‘2023లో నా ప్రయాణంలో నావెంటనే ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా రకాలుగా ఈ ఏడాది అద్భుతంగా నిలిచింది. నా ఎన్నో ముఖ్యమైన అనుభవాలనూ మిగిల్చింది. ముఖ్యంగా నా వెంటనే ఉన్న ప్రతి ఒక్కరి పట్ల గ్రాటీట్యూట్ చూపిస్తున్నాను. అంతే మర్యాదగా 2023కు వీడ్కోలు పలుకుతున్నాను. ఈ ఏడాది ఎంతో సంతోషాన్ని నింపింది. ఇక 2024కు స్వాగతం పలుకుదాం’. అంటూ పోస్ట్ పెట్టారు. 

ఈ సందర్భంగా బన్నీ కూడా అభిమానులు హ్యాపీ న్యూయర్ చెబుతున్నారు. కొత్త సంవత్సరం మరింతగా సక్సెస్ అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ 2023లో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. పుష్పలో తన నటనకు గాను ఈ అవార్డు దక్కింది. ఇక నెక్ట్స్ ఈయర్ రాబోతున్న Pushpa2తో ఇండియన్ ఇండస్ట్రీలోని రికార్డులన్నీ బ్రేక్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. 

ప్రస్తుతం చిత్ర షూటింగ్ కొనసాగుతోంది. ఆ మధ్యలో వచ్చిన పుష్ప గ్లింప్స్ కు ఓ రేంజ్ రెస్పాన్స్ దక్కింది. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్న Rashmika Mandanna  కథనాయికగా నటిస్తున్నారు. ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగపతి బాబు, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2024 ఆగస్టు 15న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్  గా విడుదల చేయబోతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?