
పాలిటిక్స్ కారణంగా జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ వరుస పొలిటికల్ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరుపున అభ్యర్థుల్ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.
పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే ఆయన చేసే ఆర్థిక సహాయాలు, మంచి మనసు అభిమానులకు గుర్తుకు వస్తుంది. ఎవరు ఏ ఆర్థిక సాయం కోరినా పవన్ కాదనకుండా చేస్తారు. ఇప్పుడు పార్టీ ద్వారా పవన్ కొన్ని మంచి పనులు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ఇటీవల అనా కొణిదెల క్రిస్టమస్ వేడుకల్ని అనాధ శరణాలయంలో చిన్న పిల్లలతో జరుపుకున్నారు. ఆ సమయంలో ఆమె అనాధ శరణాలయానికి కొన్ని నిత్యావసర వస్తువులు కూడా విరాళంగా అందించారు.
తాజాగా మరోసారి అనా కొణిదెల న్యూ ఇయర్ వేడుకల్ని ఫ్రెండ్స్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకి చెందిన అనాథ శరణాలయంలో జరుపుకున్నారు. అక్కడ చిన్న పిల్లలతో కలసి కేట్ కట్ చేశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతే కాదు వాళ్ళకి అవసరమైన నిత్యావసర సరుకుల్ని అందించారు. అనా కొణిదెల మరో గొప్ప పని చేసి హృదయాలు గెలుచుకున్నారు. ఐదుగురు బాలికలు స్కూల్ ఫీజు చెల్లించాల్సిన అవసరాన్ని అనా ఫ్రెండ్స్ ట్రస్ట్ వారి ద్వారా తెలుసుకున్నారు. వెంటనే ఆమె ఆ ఐదుగురు బాలిక స్కూల్ ఫీజు స్వయంగా చెల్లించి గొప్ప మనసు చాటుకున్నారు.