'హీరో'కి డబ్బింగ్ చెబుతున్న జగ్గూ భాయ్!

Published : Jun 24, 2021, 10:05 AM ISTUpdated : Jun 24, 2021, 10:11 AM IST
'హీరో'కి డబ్బింగ్ చెబుతున్న జగ్గూ భాయ్!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా డెబ్యూ మూవీ 'హీరో'లో జగపతి బాబు నటిస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు కాగా,  డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.   


విలన్ గా సెటిలైపోయారు జగపతి బాబు. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తున్నారు. తాజాగా ఆయన సూపర్ స్టార్ మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా డెబ్యూ మూవీ 'హీరో'లో కూడా నటిస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు కాగా,  డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. 


దీనికి సంబంధించి అప్డేట్ ఇచ్చారు జగపతిబాబు. డబ్బింగ్ థియేటర్ లో తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. హీరో మూవీలో కూడా జగపతి బాబు సీరియస్ విలన్ రోల్ చేస్తున్నారని ఆ ఫోటో చూస్తే అర్థం అవుతుంది. 


ఇక ఇటీవల విడుదలైన హీరో టీజర్ సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. కౌబాయ్ గెటప్ లో హాలీవుడ్ రేంజ్ హీరోలా అశోక్ గల్లాను పరిచయం చేశారు. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ మూవీలో అశోక్ గల్లాకు జంటగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అశోక్ గల్లా స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?
Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?