ఇంటికి పిలిచి అది చూపించు అంటూ నన్ను వేధించాడు.. డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు

Published : Oct 13, 2022, 11:28 PM IST
ఇంటికి పిలిచి అది చూపించు అంటూ నన్ను వేధించాడు.. డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి చర్చ ఎప్పుడూ జరుగుతూ ఉండేదే. మీటూ ఉద్యమం మొదలైన తర్వాత నటీమణులు తమకి ఎదురైన వేధింపులని బయట పెట్టడం ప్రారంభించారు.

చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి చర్చ ఎప్పుడూ జరుగుతూ ఉండేదే. మీటూ ఉద్యమం మొదలైన తర్వాత నటీమణులు తమకి ఎదురైన వేధింపులని బయట పెట్టడం ప్రారంభించారు. తాజాగా బాలీవుడ్ బుల్లితెర నటి కనిష్క సోని ఓ డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. 

కనిష్క సోని కామెంట్స్ చేసిన డైరెక్టర్ ఎవరో కాదు. ఆల్రెడీ లైంగిక వేధింపుల విషయంలో పలువురు నటీమణుల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న సాజిద్ ఖాన్. మీటూ ఉద్యమ సమయంలో ఈ దర్శకుడిపై అనేక ఆరోపణలు వినిపించాయి. షెర్లిన్ చోప్రా, జియా ఖాన్ లాంటి నటీమణులని సాజిద్ లైగికంగా వేధించినట్లు వార్తలు వచ్చాయి. 

తాజాగా బుల్లితెర నటి కనిష్క సోని షాకింగ్ ఫ్యాక్ట్ రివీల్ చేసింది. అవకాశం ఇస్తానని తనని ఒకరోజు ఇంటికి పిలిచాడని పేర్కొంది. అతడు ప్రస్తుతం బిగ్ బాస్ లోనే ఉన్నాడు అంటూ పరోక్షంగా సాజిద్ గురించి చెప్పింది. ఇంటికి వెళ్ళాక నీ టాప్ పైకి లేపి నడుము చూపించు అని అడిగాడు. లైంగికంగా వేధించాడు. 

అతడు చాలా బలమైన వ్యక్తి. ఇండస్ట్రీ ప్రముఖులతో అతడికి సంబంధాలు ఉన్నాయి. ఏ సమయంలో అయినా అతడి నుంచి నాకు ప్రాణ హాని ఉంది. ఇండియాలో చట్టాలపై నాకు నమ్మకం లేదు అని కనిష్క సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను ఇక ఇండియాకి తిరిగి రాను అని కనిష్క తెలిపింది. విదేశాల్లోనే నటిగా అవకాశాలు వెతుక్కుంటాను అని పేర్కొంది. సాజిద్ లాంటి వ్యక్తిని బిగ్ బాస్ షోకి ఎలా ఎంపిక చేస్తారు అని కూడా కనిష్క సల్మాన్ ఖాన్ ని ప్రశ్నించింది. 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు