నా పెళ్లి నాకే సర్‌ప్రైజ్‌.. మ్యారేజ్‌పై వరలక్ష్మి శరత్ కుమార్‌ క్రేజీ రియాక్షన్‌.. `శబరి` ట్రైలర్‌ ఎలా ఉందంటే

Published : Apr 12, 2024, 02:57 PM ISTUpdated : Apr 12, 2024, 03:04 PM IST
నా పెళ్లి నాకే సర్‌ప్రైజ్‌.. మ్యారేజ్‌పై వరలక్ష్మి శరత్ కుమార్‌ క్రేజీ రియాక్షన్‌.. `శబరి` ట్రైలర్‌ ఎలా ఉందంటే

సారాంశం

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ తన పెళ్లిపై క్రేజీగా రియాక్ట్ అయ్యింది. సర్‌ప్రైజ్‌ అంటూ వెల్లడించింది. `శబరి` మూవీ గురించి ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది.   

లేడీ రెబల్‌ స్టార్‌గా పేరుతెచ్చుకుంటుంది వరలక్ష్మి శరత్ కుమార్. ఆమె సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. అద్భుతమైన నటనతో అదరగొడుతుంది. పాత్ర, కథ బలంగా ఉంటే, చిన్నా పెద్ద అనే తేడా లేకుండా సినిమాలు చేస్తుంది. ఇటీవల `హనుమాన్‌` చిత్రంతో అదరగొట్టింది. ఇప్పుడు `శబరి` అనే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంతో రాబోతుంది. ఈ మూవీ ట్రైలర్‌ గురువారం విడుదల చేశారు. ఇందులో తన పెళ్లి గురించి స్పందించింది వరలక్ష్మి శరత్‌ కుమార్‌. తన పెళ్లి తనకే సర్‌ప్రైజ్‌ అని తెలిపింది. తనకు గతంలో పెళ్లిపై అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదని చెప్పింది. దీంతో ఇప్పుడు ఏకంగా ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకుంది. దీంతో తనకు పెళ్లి అనేది పెద్ద సర్‌ప్రైజ్‌ అని చెప్పింది. 

అయితే అది ప్లాన్‌ చేయలేదని, చాలా ఆర్గానిక్‌గా జరిగిందని చెప్పిన వరలక్ష్మి.. త్వరలోనే మ్యారేజ్‌ చేసుకుంటానని, ఈ ఏడాదిలోనే పెళ్లి ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. అయితే డేట్‌కి సంబంధించిన క్లారిటీ ఇవ్వలేదు. ఈ సందర్భంగా ఆమె ఓ విషయంపై క్లారిటీ ఇచ్చింది. తనకు ఫస్ట్ ప్రయారిటీ సినిమా అని, తర్వాతే పెళ్లి అని చెప్పింది. ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న నెక్ట్స్ డేనే తాను షూటింగ్‌లో పాల్గొన్నట్టు తెలిపింది. రేపు పెళ్లి అయ్యాక కూడా అంతే, షూటింగ్‌లకు ప్రయారిటీ ఇస్తానని, పెళ్లి తర్వాత కూడా తాను సినిమాలు చేస్తానని వెల్లడించింది. వరలక్ష్మి ముంబయి బేస్ట్ వ్యాపారవేత్త నికోలాయ్‌ని వివాహం చేసుకోబోతుంది. అతను వరలక్ష్మి చైల్డ్ వుడ్‌ ఫ్రెండ్‌ కావడం విశేషం. 

ఇక ప్రస్తుతం వరలక్ష్మి `శబరి` చిత్రంతో రాబోతుంది. వచ్చే నెల 3న ఈ మూవీ రిలీజ్‌ కానుంది. పాన్‌ ఇండియా మూవీగా దీన్ని రిలీజ్‌ చేస్తున్నారు. తెలుగులో వరలక్ష్మి నటించిన ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్‌ మూవీ ఇది. అనిల్‌ దర్శకత్వం వహించగా, మహేంద్రనాథ్‌ కొండ్ల నిర్మిస్తున్నారు. ఇందులో వరలక్ష్మి మెయిన్‌ లీడ్‌గా చేస్తున్నారు. ఇందులో ఆమె పిల్లకి తల్లిగానూ కనిపిస్తుంది. తన కూతురుని కాపాడుకోవడానికి ఆమె చేసిన పోరాటం నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కుతుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఎంగేజింగ్‌గా ఉంది. 

`శబరి` సినిమా గురించి వరలక్ష్మి మాట్లాడుతూ, తెలుగులో నాకిది ఫస్ట్  ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా. తన క్యారెక్టర్ చుట్టూ నడిచే సినిమా చేయడం ఏ నటి అయినా సరే ఎగ్జైట్ అవుతుంది. ఇప్పుడు ప్రేక్షకులు మంచి టాక్ వస్తే సినిమాలు చూస్తున్నారు. గుడ్ కంటెంట్ ఉంటే చూస్తున్నారు. 'శబరి' ట్రైలర్ చూడటం థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్. లీడ్ రోల్ చేశా కనుక కథ నాకు తెలుసు. ట్విస్ట్స్, టర్న్స్ పెట్టి ప్రజెంట్ చేశారు. నాకు ట్రైలర్ నచ్చింది. మహేంద్రనాథ్ నిర్మాతగా తొలి ఫస్ట్ ప్రాజెక్ట్ అయినా ఫిమేల్ ఓరియెంటెడ్ కథను నమ్మి రాజీ పడకుండా సినిమా చేశారు. బడ్జెట్ ఎక్కువైనా బాక్సాఫీస్ రెవెన్యూ వస్తుందా? మార్కెట్ ఎంత? అని ఆలోచించకుండా సినిమా బాగా రావాలని ఖర్చు చేశారు. వండర్ ఫుల్ స్క్రిప్ట్ నా దగ్గరకు తీసుకు వచ్చిన దర్శకుడు అనిల్ కి థాంక్స్. తన బిడ్డను కాపాడడం కోసం తల్లి ఏం చేసిందనేది కథ. సినిమా బావుంటే చూసే తెలుగు ప్రేక్షకులకు థాంక్స్` అని చెప్పింది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది