బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ (Om Raut) ‘ఆదిపురుష్’ రిలీజ్ తర్వాత తాజాగా ట్వీటర్ లో పోస్టు చేశారు. మూవీ విడుదలై నెల దాటినా ఆ ఎఫెక్ట్స్ రౌత్ ను వీడటం లేదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) రీసెంట్ గా హిందూ మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’తో అలరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. హిందీలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. కృతి సనన్, సైఫ్ అలీఖాన్, దేవ్ దత్త కీలక పాత్రలు పోషించారు. టీ - సిరీస్ బ్యానర్ పై జూన్ 16న విడుదలైంది. ఎన్నో అంచనాలను క్రియేట్ చేసిన ఈ చిత్రం చివరకు విమర్శలనే అందుకుంది.
చిత్రం ప్రారంభంలో కాస్తా హైప్ క్రియేట్ అయినా.. ఆ తర్వాత వచ్చిన అప్డేట్స్ తో మాత్రం ట్రోల్స్ కు గురైంది. నాసిరకమైన వీఎఫ్ఎక్స్, రామాయణంలోని పాత్రలను సరిగా చూపించకపోవడంతో ప్రేక్షకులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. దీంతో సోషల్ మీడియా వేదిక రకరకాలుగా తమ అభిమానులను వ్యక్తం చేశారు. దాని ప్రభావం బాక్సాఫీస్ కలెక్షన్లపైనా కూడా పడింది.
ఏకంగా రూ.600 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ చిత్రం సగం మేర నష్టాలను మిగిల్చిందని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేశాయి. ఇదిలా ఉంటే.. సినిమా విడుదల తర్వాత ఓం రౌత్ ఒకసారి ట్వీట్ చేశారు. హన్ముంతుడికి కేటాయించిన సీట్లను చూపే చిత్రాన్ని పంచుకున్నారు. ఆ తర్వాత మళ్లీ తాజాగా మరో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందంటే..
ఇన్ స్టాలో ఓం రౌత్ రాస్తూ.. ‘శ్రీ మంగేశి దేవాలయం, శ్రీ శాంతదుర్గ దేవాలయంలో దేవతల దర్శనం పూర్తైంది. ఇక్కడి వచ్చిన ప్రతిసారి నా చిన్నప్పటి మెమోరీస్ గుర్తుకు వస్తాయి. ఈ రెండు పుణ్యక్షేత్రాలు నా మూలాలను గుర్తుచేస్తుంటాయి. అందుకే ఈ దేవాలయాలకు రావాలంటే చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది.’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు మాత్రం దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. ‘నువ్వు దేవుళ్ల సినిమాలు చేయకు’ అని ఓ నెటిజన్ డైరెక్ట్ కామెంట్ చేశారు. మరికిందరు నెటిజన్స్ రూ.600కోట్లు ఆగం చేశావు కదా అంటూ తమ అభిమాప్రాయాలను వ్యక్తం చేశారు. దీంతో రౌత్ పోస్ట్ వైరల్ గా మారింది.