నమ్రతపై మహేష్‌కి కంప్లైంట్‌ చేసిన నిర్మాత ఎంఎస్‌ రాజు.. `ఒక్కడు` పోస్ట్‌పై మనస్థాపం

Published : Jan 16, 2021, 12:33 PM IST
నమ్రతపై మహేష్‌కి కంప్లైంట్‌ చేసిన నిర్మాత ఎంఎస్‌ రాజు.. `ఒక్కడు` పోస్ట్‌పై మనస్థాపం

సారాంశం

మహేష్‌ బాబు, భూమిక జంటగా నటించిన బ్లాక్‌బస్టర్‌ `ఒక్కడు` విడుదలై శుక్రవారానికి 18ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం దీన్ని గుర్తు చేసుకుంటూ విషెస్‌ తెలియజేశారు.  ఈ సందర్భంగా నమ్రత ఈ సినిమాపై ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది. 

నమ్రతపై మహేష్‌బాబుకి కంప్లైంట్‌ చేశారు నిర్మాత ఎంఎస్‌ రాజు. నమ్రత చేసిన పోస్ట్ తనని బాధించిందని వెల్లడించారు. అయితే తాను హ్యాపీగానే ఉన్నానన్నారు. ఇంతకి నమ్రతపై నిర్మాత ఎం.ఎస్‌.రాజు.. మహేష్‌కి ఎందుకు ఫిర్యాదు చేశాడనేది తెలుసుకుంటే. మహేష్‌ బాబు, భూమిక జంటగా నటించిన బ్లాక్‌బస్టర్‌ `ఒక్కడు` విడుదలై శుక్రవారానికి 18ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం దీన్ని గుర్తు చేసుకుంటూ విషెస్‌ తెలియజేశారు. 

ఈ సందర్భంగా నమ్రత ఈ సినిమాపై ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది. `మహేష్‌ నటించిన సినిమాల్లో `ఒక్కడు` క్లాసిక్‌ హిట్‌. మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా. `ఒక్కడు` నా ఆల్‌టైమ్‌ ఫేవరేజ్‌` అని పేర్కొంటూ, మహేష్‌,  భూమిక, దర్శకుడు గుణశేఖర్‌, ప్రకాష్‌ రాజ్‌, ఫైట్‌ మాస్టర్‌ విజయన్‌, సంగీత దర్శకుడు మణిశర్మ పేర్లని మెన్షన్‌ చేసింది. ఇందులో నిర్మాత ఎం.ఎస్‌. రాజు పేరుని మర్చిపోయింది. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. 

ఇది చూసిన నిర్మాత ఎంఎస్‌. రాజు హర్ట్ అయ్యారు. తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. దీంతో నమ్రతపై మహేష్‌కి ఫిర్యాదు చేశారు. ట్విట్టర్‌లో మహేష్‌ని కోట్‌ చేస్తూ, `పొరపాట్లు జరుగుతుంటాయి బాబు. నమత్రగారు `ఒక్కడు` సినిమా గురించి మాట్లాడుతూ, నా పేరుని మర్చిపోయారు. అయినా నాకు సంతోషమే. ఈ సినిమా ఆమెకి ఫేవరేజ్‌ చిత్రం కావడం. గుడ్‌లక్‌` అని పేర్కొన్నారు. దీనిపై ఈ సినిమా అభిమానులు, ఎంఎస్‌ రాజు ఫ్యాన్స్ స్పందిస్తూ, మీరు లేకపోతే సినిమా లేదని, గొప్ప సినిమాని అందించినందుకు కృతజ్ఞతలు అంటూ ఆయనకు మద్దతుగా పోస్ట్ లు పెడుతున్నారు. మరి దీనిపై మహేష్‌ స్పందిస్తారా? నమ్రత తన తప్పుని సరిదిద్దుకుంటుందా? అన్నది చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Krishna కథ వినకుండా మహేష్ బాబు చేసిన డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?
Long Delayed Movies: చిరంజీవి నుంచి నాగ చైతన్య వరకు.. లాంగ్ డిలే వల్ల అడ్రస్ లేకుండా పోయిన 8 సినిమాలు ఇవే