మిలియన్స్ వ్యూస్‌తో ట్రెండ్‌ అవుతున్న ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ప్రైవేట్‌సాంగ్‌ `లడీ లడీ`.. రేర్‌ ఫీట్‌

Published : Jan 16, 2021, 09:46 AM IST
మిలియన్స్ వ్యూస్‌తో ట్రెండ్‌ అవుతున్న ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ప్రైవేట్‌సాంగ్‌ `లడీ లడీ`.. రేర్‌ ఫీట్‌

సారాంశం

ప్రియా ప్రకాష్ వారియర్‌ ఫస్ట్ టైమ్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌లో చేయడం విశేషం. దీన్ని కొరియోగ్రాఫర్‌ రఘు మాస్టర్‌ రూపొందించారు. బిగ్‌బాస్‌3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ ఈ పాటని ఆలపించారు. సంక్రాంతి సందర్భంగా ఈ పాటని విడుదల చేశారు. ఇది సోషల్‌ మీడియాలో మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతుంది.

కన్నుగీటితో డే అండ్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయింది ప్రియా ప్రకాష్‌ వారియర్‌. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు దక్కించుకుంటూ రాణిస్తున్న ఈ అమ్మడు మరో ప్రైవేట్‌ ఆల్బమ్‌లో మెరిసింది. `లడీ లడీ `అనే ప్రైవేట్‌ సాంగ్‌లో నూతన నటుడు రోహిత్‌నందన్‌తో కలిసి ఆడిపాడింది. ప్రస్తుతం ఈ ప్రైవేట్‌ స్పెషల్‌ సాంగ్‌ యూట్యూబ్‌లో, సోషల్‌ మీడియా మాధ్యమాల్లో దుమ్మురేపుతుంది. మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. 

ప్రియా ప్రకాష్ వారియర్‌ ఫస్ట్ టైమ్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌లో చేయడం విశేషం. దీన్ని కొరియోగ్రాఫర్‌ రఘు మాస్టర్‌ రూపొందించారు. బిగ్‌బాస్‌3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ ఈ పాటని ఆలపించారు. సంక్రాంతి సందర్భంగా ఈ పాటని విడుదల చేశారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించిన పాటకి విస్సాప్రగడ లిరిక్స్ అందించారు. పబ్‌లో పక్క మాస్‌ బీట్‌లో రాహుల్‌ సిప్లిగంజ్‌ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇందులో ప్రియా అందాలు, రోహిత్‌ నందన్‌ అద్భుతమైన డాన్స్ పాటకు హైలైట్స్ గా నిలిచింది. మ్యాంగో సంస్థ నుంచి ఈ పాట విడుదలైంది. 

ప్రస్తుతం ఈ పాటకి దాదాపు రెండు మిలియన్స్ వ్యూస్‌ రాబట్టింది. దీనిపై ప్రియా ప్రకాష్‌ వారియర్‌ స్పందించి ఆనందాన్ని వ్యక్తం చేసింది. `ఈ పాటని ఇంత పెద్ద హిట్‌ చేసిన ఆడియెన్స్ కి థ్యాంక్స్. ఈ సందర్భంగా నా టీమ్‌కి ధన్యవాదాలు. ఇది నా బలం కాదు. రఘు మాస్టర్‌ టీమ్‌తో సాధ్యమైంది. దానికి నేను న్యాయం చేయగలిగాను. ఈ పాట తీసే క్రమంలో నేను చాలా సార్లు గాయపడ్డాను. రిహార్సల్స్ లోనూ ఇబ్బంది పడ్డాను. అయినా పాటకి స్పందన రావడంతో చాలా హ్యపీగా ఉంది. ఈ పాట నా కంఫర్ట్ జోన్‌ నుంచి బయటపడేలా చేసింది` అని తెలిపింది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?