సమంతా కిడ్నాప్ చేస్తుందట!

Published : Jun 08, 2018, 12:50 PM ISTUpdated : Jun 08, 2018, 12:53 PM IST
సమంతా కిడ్నాప్ చేస్తుందట!

సారాంశం

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంతా జంటగా నటించిన చిత్రం 'రంగస్థలం'

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంతా జంటగా నటించిన చిత్రం 'రంగస్థలం'. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా ఆల్బమ్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ లభించింది.

ఇప్పటికీ ఈ సినిమా పాటలు వినబడుతూనే ఉన్నాయి. 'రంగమ్మా.. మంగమ్మా' పాటకు సూపర్ అప్లాజ్ దక్కింది. యూట్యూబ్ లో ఇప్పటికే ఆ పాటకు కొన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయి. తాజాగా ఓ చిన్న పిల్లాడు ఈ పాటకు చేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, డాన్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ వీడియో చూసిన సమంతా.. 'ఓకే ఈ క్యూటీనీ కిడ్నాప్ చేస్తున్నాను' అంటూ సరదాగా కామెంట్  పెట్టింది. ఆ పిల్లాడు తన డాన్స్ తో సామ్ ను అంతగా మెప్పించాడు మరి..

 

 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు