*ఓ బేబీ* మూవీ ట్విట్టర్ రివ్యూ

Published : Jul 05, 2019, 08:09 AM ISTUpdated : Jul 05, 2019, 08:14 AM IST
*ఓ బేబీ* మూవీ ట్విట్టర్ రివ్యూ

సారాంశం

నందిని రెడ్డి డైరెక్షన్ సమంత నటించిన ఓ బేబీ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే సినిమా ప్రీమియర్ షోలకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాను చూసిన వారు సమంతను పొగడ్తలతో ముంచేత్తుతున్నారు. 

నందిని రెడ్డి డైరెక్షన్ సమంత నటించిన ఓ బేబీ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే సినిమా ప్రీమియర్ షోలకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాను చూసిన వారు సమంతను పొగడ్తలతో ముంచేత్తుతున్నారు. సినిమాలో కామెడీ అండ్ ఎమోషన్ సమపాళ్లలో ఉన్నాయంటూ ట్విట్టర్ లో వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. 

మెయిన్ గా సినిమాలో సమంత నటన అంధరిని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కథ కూడా సినిమాకు మరో ప్లస్ పాయింట్. సౌత్ కొరియన్ మూవీ మిస్ గ్రానీ ఆధారంగా రూపొందించిన ఈ సినిమాను దర్శకురాలు నందిని రెడ్డి చాలా బాగా డీల్ చేశారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచుకి తగ్గట్టుగా ఈ సెన్సిటివ్ కథను ఎంటర్టైన్ చేస్తూ చూపించడం చాల బావుందని అంటున్నారు. 

ఇక రాజేంద్రప్రసాద్ - నాగ శౌర్య - ఇతర పాత్రలు సినిమాలో లీనమయ్యేలా చేశాయి. మెయిన్ గా సమంత కెరీర్ బెస్ట్ పెర్ఫెమెన్స్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇక సినిమాలో క్లయిమ్యాక్స్  ప్రతి ఒక్కరిని కదిలిస్తుంధని చెబుతున్నారు. ఫైనల్ గా ఓ బేబీ ప్రీమియర్స్ ద్వారా ఇంటర్నెట్ లో పాజిటివ్ రివ్యూలతో దూసుకుపోతోంది. మరి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

 

PREV
click me!

Recommended Stories

రాజా సాబ్ వారం రోజుల కలెక్షన్స్, ప్రభాస్ సినిమా 7వ రోజు ఎంత వసూలు చేసిందంటే?
IMDB మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్.. టాప్ 20లో ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారంటే?