
పవన్ కళ్యాణ్ నటిస్తోన్న `ఓజీ` మూవీ మరో రెండు రోజుల్లోనే ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. సుజీత్ రూపొందించిన ఈ ముంబయి గ్యాంగ్ స్టర్ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలున్నాయి. ఆదివారం నిర్వహించిన `ఓజీ` మ్యూజిక్ కాన్సర్ట్ తో ఆ అంచనాలు బాగా పెరిగాయి. అందులో విడుదల చేసిన ట్రైలర్ గూస్ బంమ్స్ తెప్పించింది. యాక్షన్ సీన్లు, పవన్ కళ్యాణ్ ఎలివేషన్లు, మరోవైపు తమన్ ఆర్‌ఆర్ అదిరిపోయింది.
ఓవర్సీస్‌లో ఈ మూవీకి బజ్ గట్టిగానే ఉంది. ఇప్పటికీ ప్రీమియర్స్ షోస్‌కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఇది రెండు మిలియన్స్ దాటింది. ఈ ట్రైలర్‌తో అది మరింతగా పెరిగిపోతుంది. ప్రీమియర్స్, ఫస్ట్ డే కలుపుకుని ఈ చిత్రం అక్కడ తొలి రోజు ఐదు మిలియన్స్ కలెక్ట్ చేసినా ఆశ్చర్యం లేదు. ఇక తెలుగు స్టేట్స్ లోనూ అదే బజ్ నెలకొంది. ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ బుకింగ్స్ ఓపెన్ చేయాల్సి ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు భారీగానే పెరిగాయి. బెనిఫిట్ షోస్ కి టికెట్ రేట్లు వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు. ఇక రెగ్యూలర్ టికెట్లపై రూ.120 నుంచి రూ.150 వరకు పెంచారు. దాదాపు పది రోజులపాటు ఈరేట్లు అమలులో ఉంటాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ టికెట్ భారీ ధరకు అమ్ముడు పోయింది. వేలం పాట వేసి మరీ ఓ పవన్ కళ్యాణ్ అభిమాని లక్షా 30వేలకు టికెట్‌ని సొంతం చేసుకున్నారు.
చౌటుప్పల్‌లో బెనిఫిట్ షోకి సంబంధించిన ఫస్ట్ షో టికెట్ ధరని వేలం వేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ అభిమాని ఆముదాల పరమేష్ వేలం పాడి ఏకంగా లక్షా 29,999 రూపాయలకు `ఓజీ` టికెట్‌ని దక్కించుకున్నారు. ఈ టికెట్‌ని జబర్దస్త్ కమెడియన్ వినోదిని చేతుల మీదగా తీసుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఆముదాల పరమేష్ మాట్లాడుతూ వేలంపాటలో పాడిన డబ్బులను జనసేన పార్టీ కార్యాలయానికి అందజేస్తామని తెలిపారు. ఒక సినిమా టికెట్‌ని ఇంత భారీ మొత్తానికి కొనడమనేది బహుశా పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రమే చెల్లిందని చెప్పొచ్చు.
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన `ఓజీ` మూవీని డీవీవీ దానయ్య నిర్మించారు. ఇందులో ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పవన్ సరసన ప్రియాంక మోహన్ నటించింది. ఈ చిత్రం ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నెల 24 రాత్రి బెనిఫిట్ షోస్ పడబోతున్నాయి.