Kantara Chapter 1 Trailer: రిషబ్‌ శెట్టి కాంతార చాప్టర్ 1 ట్రైలర్ వచ్చేసింది.. దసరాకి అసలైన పండగ

Published : Sep 22, 2025, 01:24 PM IST
Kantara chapter 1

సారాంశం

Kantara Chapter 1 Trailer: `కాంతార` మూవీకి ప్రీక్వెల్‌గా రూపొందుతున్న `కాంతారః చాప్టర్‌ ` ట్రైలర్‌ వచ్చింది. రిషబ్‌ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ ఆద్యంతం కట్టిపడేసేలా ఉంది. 

Kantara Chapter 1 Trailer: శాండల్ మూడేళ్ల క్రితం వచ్చి సంచలనం సృష్టించింది `కాంతార` మూవీ. `కేజీఎఫ్‌` తర్వాత కన్నడ నుంచి వచ్చిన ఈ మూవీ ఇండియన్‌ సినిమాని షేక్‌ చేసింది. తాజాగా ఈ చిత్రానికి ప్రీక్వెల్‌ వస్తోంది.  'కాంతార చాప్టర్ 1' ట్రైలర్ ఈరోజు (సెప్టెంబర్ 22) మధ్యాహ్నం 12.45 గంటలకు రిలీజ్ అయింది. 2.56 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్, `బాహుబలి` తరహాలో సాగుతున్నట్టు కనిపిస్తోంది.

`కాంతారః చాప్టర్‌ 1` తెలుగు ట్రైలర్‌ విడుదల చేసిన ప్రభాస్‌

దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తెలుగు ట్రైలర్‌ని ప్రభాస్‌ ఆవిష్కరించారు.  హిందీలో హృతిక్ రోషన్, తమిళంలో శివకార్తికేయన్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమార్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. కన్నడ ట్రైలర్‌ను కన్నడ అభిమానులే విడుదల చేయడం విశేషం.

 యాక్షన్‌ థ్రిల్లర్‌గా `కాంతార 2`

సినిమా రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఇప్పటికే రిలీజ్ అయిన మేకింగ్ వీడియో, పోస్టర్లు అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించాయి. బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ, ప్రగతి శెట్టి కాస్ట్యూమ్ డిజైన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. రిషబ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో కనిపించారు. 'కాంతార చాప్టర్ 1' సినిమా కళ, భక్తి, శక్తిల అద్భుతమైన కలయిక.  హిస్టారికల్‌ అంశాల మేళవింపుతో ఇది సాగింది. 

`కాంతార 2` ట్రైలర్‌ ఎలా ఉందంటే?

ట్రైలర్‌లో ప్రధానంగా `కాంతార` సినిమాలోని ఎండింగ్‌ని చూపించి, చిన్న కుర్రాడికి అసలు పూర్వం ఏం జరిగిందనేది వివరించడంతో ఈ ట్రైలర్‌ సాగింది. దీంతో కథ బ్యాక్‌ వెళ్లింది. అప్పుడు కూడా ట్రైబల్‌ ప్రాంతంలో ఓ రాజు ఉండేవాడు. ఆయన ఆధీనంలోనే అక్కడి గిరిజన ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో యువరాణిని రిషబ్‌ శెట్టి ఇష్టపడతాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. ఈ క్రమంలో అసలు గొడవ స్టార్ట్ అవుతుంది. రాజుపై హీరో పోరాటం, అది మనుగడ కోసం పోరాటంలా మారుతుంది. ఈ క్రమంలో వచ్చే యాక్షన్‌ సీన్లు అదిరిపోయాయి. యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలిమెంట్లు వాహ్‌ అనేలా ఉన్నాయి. విజువల్స్ అదిరిపోయాయి. అయితే `కాంతార` సినిమాని దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు ఈ ట్రైలర్‌ ఆశించిన స్థాయిలో లేదు. దీంతో కొంత నిరాశ కలిగిస్తుందని చెప్పొచ్చు. 

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

కృష్ణ తలచుకుంటే శోభన్‌బాబుని మించి వేల కోట్లు ఆస్తులు.. సగం చెన్నై, హైదరాబాద్‌ ఆయనదే.. సంచలన విషయాలు వెల్లడి
Allu Arjun Peddi Review: నిన్ను చూస్తే గర్వంగా ఉంది బ్రదర్‌.. రామ్‌ చరణ్‌ పెద్దిపై అల్లు అర్జున్‌ సంచలన పోస్ట్