
సీనియర్ నటుడు, నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) సినిమాలంటే సహజంగానే అభిమానుల్లో భారీ హైప్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆయన చిత్రాలకు ఖరారు చేసే టైటిళ్లపై మరింత ఆసక్తిగా నెలకొటుంది. ఇటీవల ‘అఖండ’తో భారీ సక్సెస్ ను అందుకున్న బాలయ్య ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మాలినేని (Gopichand Malineni)తో ‘ఎన్బీకే107’లో నటిస్తున్నారు. చిత్రం ప్రస్తుతం తుది దశ షూటింగ్ లో ఉంది. చిత్రం ప్రారంభం నుంచి మూవీ టైటిల్ కోసం బాలయ్య అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో అభిమానులను అంచనాలను రీచ్ అయ్యేలా మేకర్స్ కూడా కేవలం టైటిల్ లాంచ్ కోసమే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై తాజాగా అధికారిక ప్రకటన చేశారు. అక్టోబర్ 21న ‘ఎన్బీకే107’ టైటిల్ లోగోను లాంచ్ చేయబోతున్నట్టు తెలిపారు. సాయంత్రం 8:15కు టైటిల్ లాంచ్‌కి ముహూర్తం లాక్ చేశారు. కర్నూల్ లోని కొండారెడ్డి బురుపై అనౌన్స్ చేయనున్నట్టు అప్డేట్ అందించారు. దీంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే చిత్రానికి ‘అన్నగారు’,‘రెడ్డి గారు’ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో ఏ టైటిల్ ను ఖరారు చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ (Shruti Haasan) కథానాయికగా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్‌లు కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సంగీత సంచలనం ఎస్ థమన్ NBK107కు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ క్రాఫ్ట్స్‌మెన్ నవీన్ నూలి ఎడిటింగ్‌ను నిర్వహిస్తుండగా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా ఉన్నారు. రామ్-లక్ష్మణ్‌ల ఫైట్స్‌తో రూపొందిన ఈ చిత్రానికి చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. స్పెషల్ నెంబర్ లో చంద్రిక రవి నటిస్తోంది.