
బాక్సాఫీస్ వద్ద గాడ్ ఫాదర్ రన్ దాదాపు ముగిసినట్లే. రెండు వారాలు ముగియగా మినిమమ్ వసూళ్లు కూడా రావడం లేదు. వీకెండ్ ముగియగానే గాడ్ ఫాదర్ జోరు తగ్గింది. ఫస్ట్ వర్కింగ్ డే సోమవారం 70% శాతం వసూళ్లు పడిపోయాయి. దసరా హాలిడేస్ ని కూడా గాడ్ ఫాదర్ ఉపయోగించుకోలేకపోయింది. గాడ్ ఫాదర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 రోజులకు గాడ్ ఫాదర్ రాబట్టిన వసూళ్లు ఇలా ఉన్నాయి.
ఏపీ/తెలంగాణాలలో కలిపి గాడ్ ఫాదర్ రూ. 42.72 కోట్ల షేర్ రూ. 70.25 కోట్ల గ్రాస్ రాబట్టింది. కర్ణాటకలో లో రూ. 4.7 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియా కలిపి రూ.5.10 కోట్ల షేర్ అందుకుంది. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే రూ.5.14 కోట్ల షేర్ నమోదు చేసింది. రెండు వారాలకు గాడ్ ఫాదర్ వరల్డ్ వైడ్ రూ. 57.66 కోట్ల షేర్, రూ.104.7 కోట్ల గ్రాస్ రాబట్టింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం గాడ్ ఫాదర్ వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
కాగా గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ హిట్ అని నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. నిర్మాత ఎన్ వి ప్రసాద్ గాడ్ ఫాదర్ సినిమాను ఎవరికీ అమ్మలేదు. సొంతగా విడుదల చేశాము. ఊహించిన వసూళ్ల కంటే ఎక్కువ గాడ్ ఫాదర్ సినిమా సాధించని వెల్లడించారు. నిజానికి మేజర్ ఏరియాల్లో గాడ్ ఫాదర్ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్స్ కి అమ్మారు. చిన్న చిన్న ఏరియాల్లో ఓన్ గా విడుదల చేశారు.
సొంతగా విడుదల చేసినా లేక డిస్ట్రిబ్యూటర్స్ కి అమ్మినా గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 85 నుండి 90 కోట్లుగా నిర్ణయించారు. ఆ లెక్కన గాడ్ ఫాదర్ మూవీ నష్టాలు మిగిల్చి నట్లే. దాదాపు 35 శాతం మేర నష్టపోయినట్లు తెలుస్తుంది. గాడ్ ఫాదర్ యూనిట్ మాత్రం దీన్ని హిట్ కూడా కాదు బ్లాక్ బస్టర్ అంటూ ప్రచారం చేస్తున్నారు. మలయాళ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కింది. మోహన్ రాజా దర్శకత్వం వహించారు.