
బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ మధ్యలో ఆపేసిన విషయం తెలిసిందే. సెలబ్రిటీ గేమ్ పేరుతో కంటెస్టెంట్స్ కి స్టార్ హీరోలు, హీరోయిన్స్ ధరించాలని బిగ్ బాస్ ఆదేశించారు. సదరు హీరోల ఐకానిక్ గెటప్స్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలని సూచించారు. ఈ గేమ్ లో కంటెస్టెంట్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. వాళ్ళ గేమ్ నిరాశాజకంగా సాగింది. దీంతో బిగ్ బాస్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ప్రతి సీజన్లో ఈ టాస్క్ కంటెస్టెంట్స్ అద్భుతంగా ఆడతారు. మీరు చరిత్రలోనే వరస్ట్ పెరఫార్మన్స్ ఇచ్చారని అసహనం వ్యక్తం చేశాడు.
గేమ్ పై ఆసక్తి లేనివారు బయటికి వెళ్లిపోవచ్చని వార్నింగ్ ఇచ్చిన బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ రద్దు చేశాను, కాస్ట్యూమ్స్ తీసేయండి అన్నారు. ఆ దెబ్బకు కంటెస్టెంట్స్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. కొందరి కోసం అందరినీ శిక్షించవద్దు, గేమ్ రద్దు చేయవద్దని కొందరు బిగ్ బాస్ ని వేడుకున్నారు. అయినా ఆయన మనసు మారలేదు.
దాని ఎఫెక్ట్ నేడు చూపించాడు. హౌస్ మేట్స్ కి ఫుడ్ లేకుండా చేశాడు బిగ్ బాస్. ఇంటిలోని కిరాణా సామాను, ఫ్రూట్స్, పాలు ఇలా మొత్తం కిచెన్ ఖాళీ చేశాడు. దీంతో ఉదయం నుండి కంటెస్టెంట్స్ తినడానికి ఏమీ లేకుండా పోయింది. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ ఆకలితో అలసిపోయారు. సూర్య అయితే చెక్కెర స్పూన్ కూడా వదలకుండా నాకాడు.
ఇకపై ఏది కావాలన్నా కష్టపడి సంపాదించుకోవాలి అన్నాడు. దీని కోసం ఇంటి సభ్యులను రెండు టీమ్స్ గా విభజించి కబడ్డీ ఆడించాడు. పరిస్థితులు చూస్తుంటే ఇంటి సభ్యులు ఫుడ్ కోసం కూడా కష్టపడాలని అర్థం అవుతుంది. అలాగే వీకెండ్ నాగార్జున ఫుల్ గా ఇచ్చిపడేస్తాడనిపిస్తుంది. ఒక్కొక్కరిని తీవ్ర స్థాయిలో ఏకిపారేసే సూచనలు కనిపిస్తున్నాయి. శిక్షలు కూడా దారుణంగా ఉండనున్నాయి.