‘సలార్’ టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. మాసీవ్ రెస్పాన్స్ పై తాజాగా మేకర్స్ స్పందిస్తూ మరో బిగ్ అప్డేట్ అందించారు. ట్రైలర్ కూడా సిద్ధం అవుతోందని, ఆ సమయంలో రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ‘సలార్’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదలవడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. జులై 6న ఉదయం 5:12 నిమిషాలకు విడుదలైన ఈ టీజర్ ప్రస్తుతం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అతి కొద్ది గంటల్లోనే 30 మిలియన్ల వ్యూస్ ను సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇక ప్రస్తుతం 100 మిలియన్ల వ్యూస్ ను చేరుకొని సెన్సేషన్ గా మారింది. ఇంతటి ప్రేమ చూపించిన అభిమానులు, ప్రేక్షకులకు మేకర్స్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ట్రైలర్ విడుదల చేయబోతున్నామంటూ బిగ్ అప్డేట్ అందించారు.
మేకర్స్ ప్రకటన విడుదల చేస్తూ.. ప్రేక్షకులు చూపించిన ప్రేమాభిమానాలకు ప్రత్యేక ధన్యవాదాలు. సలార్ టీజర్ సృష్టించిన ప్రభంజనంలో మీరంతా భాగస్వాములయ్యి, మాపై అపారమైన ప్రేమ, అభిమానం, మద్దుతు తెలిపిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాం. భారతీయ పరాక్రమానికి ఇదొక ప్రతీక. పాన్ ఇండియా సినిమా సలార్ టీజర్ 100 మిలియన్ల వ్యూస్ ను సాధించి.. ఇంకా దూసుకెళ్తొంది. ఇది మీ అచంచలమైన మద్దతుతోనే సాధమైందని, దీంతో మీకు అసామాన్యమైన సినిమాను అందించాలనే మా కొరిక మరింత బలపడిందని తెలిపారు.
అలాగే సలార్ ట్రైలర్ పైనా అప్డేట్ అందించారు. ఆగస్టు నెలలో భారతీయ సినిమా వైభవాన్ని చాటి చెప్పే అత్యంత ఆసక్తికరమైన ట్రైలర్ ను విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. ఎప్పటికీ మరిచిపోలేని మరిన్ని అప్డేట్స్ ను కూడా సిద్ధం చేసినట్టు తెలిపారు. ఇక సలార్ రెండు పార్టులు గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తతం ‘సలార్ : కాల్పుల విరమణ’ అనే టైటిల్ తో ఫస్ట్ పార్ట్ ను తీసుకురాబోతున్నారు.
టీజర్ కే ఈ రేంజ్ రెస్పాన్స్ ఉందంటే.. ఇక ట్రైలర్ వస్తే ఇంటర్నెట్ బ్రేక్ అవ్వడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం అందించిన బిగ్ అప్డేట్ కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. చిత్రంలో ప్రభాస్ - శృతి హాసన్ జంటగా నటిస్తున్నారు. విలన్స్ గా ఫృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు నటిస్తున్నారు. తమిళ నటి శ్రియా రెడ్డి కీలక పాత్ర పోషించింది. హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
100 Million Views and we're feeling dino-mite!
Thank you all for being part of this incredible milestone. Your support means the world to us 🙏🏻 ▶️ https://t.co/AhH86b1cQS … pic.twitter.com/QXOS6vscJi