మార్పింగ్ ఫొటోలతో అనసూయకు వేధింపులు, అరెస్ట్..అతనెవరంటే...

Published : Nov 27, 2022, 09:31 AM IST
మార్పింగ్ ఫొటోలతో అనసూయకు వేధింపులు, అరెస్ట్..అతనెవరంటే...

సారాంశం

 అనసూయ ఫిర్యాదు తో అప్రమత్తమైన పోలీసులు వెంటనే విచారణ చేపట్టి అతడిని పట్టుకున్నట్లు తెలిపారు. అతడి ల్యాప్ టాప్ లో యాక్ట్రెస్ రోజా, అనసూయ, విష్ణు ప్రియ, రష్మీ, ప్రగతి ఫోటోలతో పోస్టులు ఉన్నట్లు తెలిపారు.  


సూపర్ హిట్ జబర్థస్త్ షోలో యాంకరింగ్‌తో పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ సోషల్ మీడియాలో మొదటి నుంచి యాక్టివ్ గా ఉంటూ వస్తోంది. అదే విధంగా సోషల్ మీడియాలో తనను ఎవరైనా టచ్ చేస్తే వారి తాట తీసే పోగ్రాం పెట్టుకుంటోంది. ఆ క్రమంలోనే తన ఫొటోలతో పాటు హీరోయిన్ల ఫోటోలను ఫేక్ అకౌంట్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఆకతాయిలపై అనసూయ గట్టిగానే యాక్షన్ తీసుకుంది. సైబర్ క్రైమ్ పోలీసులకు వారిపై ఫిర్యాదు చేసింది. అసభ్యకరమైన పోస్టులు, కామెంట్స్ పెడుతున్నవారిని పట్టుకోవాలని ఆమె పోలీసులను   డిమాండ్ చేసి పట్టించింది. 

అనసూయ ఫిర్యాదు అందుకున్న పోలీసులు..ఫేస్ బుక్ ,ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ యాప్స్ లో టాలీవుడ్ హీరోయిన్స్ ఫొటోస్ పెట్టి అసభ్యకరమైన రాతలు రాస్తున్న నిందితుడు పందిరి రామ వెంకట వీర్రాజును అరెస్ట్ చేశారు. 354 (A)(D), 559 ఐపిసి సెక్షన్ 67 67(A) ఐ టి యాక్ట్ 2000 2018 నిందితుడు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు పోలీసులు తెలిపారు. సాయి రవి అనే ఫేక్ అకౌంట్ తో హీరోయిన్స్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఆసభ్యకరంగా కామెంట్స్ పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 

నిందితుడు ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా పసలపూడి గ్రామానికి చెందిన వాడని,గతంలో మూడేళ్లపాటు దుబాయిలో ప్లంబర్ వర్క్ చేసి ఇండియాకు వచ్చి హీరోయిన్ల ఫోటోలను పోస్ట్ చేస్తూ డబ్బు గుంజుతున్నట్లు పోలీసులు తెలిపారు. అనసూయ ఫిర్యాదు తో అప్రమత్తమైన పోలీసులు వెంటనే విచారణ చేపట్టి అతడిని పట్టుకున్నట్లు తెలిపారు. అతడి ల్యాప్ టాప్ లో యాక్ట్రెస్ రోజా, అనసూయ, విష్ణు ప్రియ, రష్మీ, ప్రగతి ఫోటోలతో పోస్టులు ఉన్నట్లు తెలిపారు.  

ఇక కెరీర్ విషయానికి వస్తే.....జబర్దస్త్ వదిలేసిన అనసూయ ఇతర ఛానల్స్ లో ఒకటి రెండు షోస్ చేస్తున్నారు. ఆమె ఎక్కువగా నటనపై దృష్టి పెడుతున్నారు. చేసినవి  త‌క్కువ సినిమాలే అయినా త‌న‌కు గుర్తింపు వ‌చ్చే పాత్ర‌లే చేస్తుంది అన‌సూయ‌.  గ్లామ‌ర్ రోల్స్ అని కూర్చోకుండా కేవ‌లం ప‌ర్ఫార్మెన్స్ ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ల చుట్టూ అను తిరుగుతుంది. దాంతో ఈ జబర్దస్త్ భామను వెతుక్కుంటూ మ‌రీ  ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. 

వెండితెర అవకాశాలు వస్తున్న క్రమంలో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం రంగమార్తాండ, పుష్ప 2 చిత్రాల్లో అనసూయ నటిస్తున్నారు. అలాగే మరికొన్ని చిత్రాలు,సిరీస్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. కాగా అనసూయ అనవసరమైన వివాదాల్లో తలదూర్చి కెరీర్ నాశనం చేసుకుంటారన్న వాదన ఉంది. లైగర్ మూవీపై ఇండైరెక్ట్ ట్వీట్ వేసి అనసూయ ట్రోల్స్ కి గురైన విషయం తెలిసిందే. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్
Krishna కథ వినకుండా మహేష్ బాబు చేసిన డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?