#kantara:‘వరాహ రూపం..’సాంగ్ ఒరిజనల్ ఓటిటిలో వచ్చేసింది...కానీ

By Surya PrakashFirst Published Nov 27, 2022, 9:07 AM IST
Highlights

గురువారం నుంచి ఆ సినిమా ఒక ఓటీటీలో ప్రసారం అవుతోంది, ఆ పాట, సంగీతంలో మార్పులు చేస్తూ హొంబాళె ప్రొడక్షన్‌ విడుదల చేసింది. ఆ పాట, సంగీతంపై తైక్కుడమ్‌ బ్రిడ్జ్‌ సంస్థ కాపీ రైట్ హక్కులు ఉన్నాయని గతంలో ఆరోపించింది. 


 కాంతార (Kantara)చిత్రం రీసెంట్ గా  ఓటీటీలోకి వచ్చింది. కానీ.. ఆ సినిమా చూసిన చాలా మంది ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేశారు. ఎందుకంటే వారు దేని కోసం అయితే మళ్లీ మళ్లీ చూసారో ఆ పాట అందులో లేదు.   సినిమాకి సోల్ గా మారిన వరాహ రూపం (Varaha Roopam) సాంగ్‌ని తొలగించడం చాలా మందిని భాదించింది. ఆ పాట స్థానంలో వేరొక ట్యూన్ యాడ్ చేసినా అది ఎవరికీ నచ్చలేదు. దాంతో సోషల్ మీడియాలో ఈ విషయమై రకరకాల కామెంట్స్ చేసారు..  వరాహ రూపం ఒరిజనల్ సాంగ్ కోసం పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఆ సాంగ్ లేకపోతే సినిమా చూసినా.. ఆ ఫీల్ రావట్లేదని అన్నారు.

వరాహరూపం పాటపై మలయాళ బ్యాండ్‌ ‘తెయ్యికుడుం బ్రిడ్జ్‌’ ఈచిత్రంలోని పాటపై న్యాయపోరాటానికి దిగింది. దీంతో వరాహ రూపం పాటలోని మ్యూజిక్‌ తొలగించే ఓటీటీ స్ట్రీమింగ్ మొదలు పెట్టారు. ఈలోగా జనాల  కోరికను దేవుడు మన్నించినట్లుగా... ‘వరాహ రూపం...’ పాట, సంగీతాన్ని ప్రదర్శించడంపై ఉన్న నిషేధాన్ని కేరళలోని కోజికోడ్‌ న్యాయస్థానం తొలగించింది.  దాంతో.. మళ్లీ వరహా రూపం సాంగ్‌ని యాడ్ చేసేందుకు  ఓటిటి సంస్ద ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఇప్పటికే తమిళ్, మళయాళం వెర్షన్‌లో వరహా రూపం సాంగ్‌ని ఓటీటీలో యాడ్ చేశారు. కానీ.. తెలుగు, కన్నడలో మాత్రం ఇంకా చేయలేదు. ఇది తెలుగు ఆడియన్స్ నిరాశపరుస్తోంది.

నిజానికి తెలుగు,కన్నడ  రెండు రాష్ట్రాల్లోనే కాంతార సినిమాని ఎక్కువగా ఆదరించారు. కన్నడలో రూ.168 కోట్లు వరకు కలెక్షన్లు రాగా.. తెలుగు రాష్ట్రాల్లో రూ.60 కోట్ల వరకు వసూళ్లని కాంతార రాబట్టింది.    కేవలం రూ. 16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లను రాబట్టి సంచలనం సష్టించిందీ సినిమా. తెలుగులోనూ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న కాంతార మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
 

click me!